Rapthadu Honour Killing: అనంతపురం జిల్లా రాప్తాడులో పరువు హత్య చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఎప్పటిలాగే శుక్రవారం (జూన్ 17) విధులకు బయలుదేరిన అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి హతమార్చారు. మృతుడిని మురళిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే... శ్రీసత్య సాయి జిల్లా కనగానపల్లికి చెందిన మురళి (27) అనే యువకుడు పీజీ వరకు చదివాడు. ప్రస్తుతం అనంతపురం జిల్లా పెనుగొండలోని కియా కార్ల కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వీణ అనే యువతితో మురళికి పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. వీణ ఏలుకుంట్ల గ్రామ సచివాలయంలో గ్రామ పోలీస్‌గా విధులు నిర్వర్తిస్తోంది. పెద్దలను ఎదిరించి ఈ ఇద్దరు గతేడాది జూన్‌లో వివాహం చేసుకున్నారు.


పెళ్లి తర్వాత అనంతపురం జిల్లా రాప్తాడులో నివాసముంటున్నారు. మురళి ఉద్యోగ రీత్యా ప్రతీరోజు రాప్తాడు నుంచి పెనుగొండకు వెళ్లి వస్తున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం కూడా విధులకు బయలుదేరాడు. రోడ్డుపై బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని అపహరించారు. బలవంతంగా ఆటోలో ఎక్కించి తీసుకెళ్లారు. విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికొచ్చిన వీణ.. భర్త మురళికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. మిత్రులతో కలిసి చుట్టుపక్కల అతని కోసం గాలించింది.


ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో రాప్తాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు లింగనపల్లి గ్రామ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు సమాచారం అందింది. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన పోలీసులు ఆ మృతదేహం మురళిదే అని నిర్ధారించారు. దుండగులు గొంతు కోసి హత్య చేసినట్లు గుర్తించారు. మురళి భార్య వీణకు హత్యపై సమాచారం అందించారు. తాను మురళిని కులాంతర వివాహం చేసుకున్నాననే కారణంతో తన తల్లే హత్య చేయించి ఉంటుందని వీణ ఆరోపించారు. వీణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేి దర్యాప్తు జరుపుతున్నారు.


Also Read: Secunderabad Agnipath Violence: 'పెట్రోల్, టైర్లు, పాత దుస్తులు తీసుకురా'.. సికింద్రాబాద్ 'అగ్నిపథ్' అల్లర్లకు వాట్సాప్‌ ద్వారా ఇలా కుట్ర..


Also Read: PM Modi: శత వసంతంలోకి హీరాబెన్.. కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.