Secunderabad Agnipath Violence: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న'అగ్నిపథ్' అల్లర్లు పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్లు అధికార వర్గాలు చెబుతున్న సంగతి తెలిసిందే. వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌ల ద్వారా నిరసనకారులంతా ఒక్కటైనట్లు తెలుస్తోంది. ఈ గ్రూప్స్ ద్వారానే విధ్వంసానికి వ్యూహ రచన జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా వెలుగుచూసిన కొన్ని వాట్సాప్ ఆడియో మెసేజ్‌లు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ప్రముఖ జాతీయ మీడియా ఈ ఆడియో మెసేజ్‌లలోని సమాచారాన్ని బయటపెట్టింది.
'సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి రేపు ఏ సమయంలో వస్తున్నావు. వచ్చేటప్పుడు పెట్రోల్, టైర్లు, పాత దుస్తులు తీసుకురా. రైల్వే స్టేషన్‌లో ఇవి మనకు దొరకవు. కాబట్టి నువ్వు వాటిని తీసుకొస్తే రైల్వే స్టేషన్‌లో వాహనాలు, రైళ్లకు నిప్పు పెట్టవచ్చు. రైల్వే సర్వీసులను అడ్డుకోవచ్చు.' అంటూ ఓ నిరసనకారుడు తాము క్రియేట్ చేసుకున్న వాట్సాప్ గ్రూప్‌లో ఈ మెసేజ్ పెట్టాడు.
ఆ పేర్లతో వాట్సాప్ గ్రూపులు :
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి గురువారమే వ్యూహ రచన జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందుకోసం 'జస్టిస్ ఫర్ ఆర్మీ సీఈఈ, హకీంపేట ఆర్మీ సోల్జర్ వంటి పేర్లతో వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసినట్లు తెలిపారు. 'సింహం వచ్చేసింది.. ఏం చేస్తారో చేసుకోండి..' అంటూ ఆ గ్రూప్స్‌లో ఓ వ్యక్తి వాయిస్ మెసేజ్ పోస్ట్ చేసినట్లు చెప్పారు.నిరసనకారుల్లో దాదాపు 200 మంది కృష్ణా ఎక్స్‌ప్రెస్ ద్వారా శుక్రవారం (జూన్ 17) ఉదయం 6గంటలకే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నట్లు గుర్తించామన్నారు.
విశాఖపట్నంలోనూ నిరసనలకు ప్లాన్:
సికింద్రాబాద్ తరహాలో విశాఖపట్నంలోనూ నిరసనలకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాట్సాప్ గ్రూపుల్లో కొందరు ట్యూటర్స్ మెసేజ్‌లను కూడా గుర్తించారు.'మీ హక్కుల కోసం నిలబడేందుకు ఇది అసలైన సమయం. కాబట్టి పోరాటంలో వెనక్కి తగ్గకండి.టీఓడీ బాయ్‌కాట్ చేయండి. పాత రిక్రూట్‌మెంట్స్ చేపట్టాలని డిమాండ్ చేయండి. ఛలో వైజాగ్ ఏఆర్వో..' అంటూ ట్యూటర్స్ పంపిన మెసేజ్‌లను వాట్సాప్ గ్రూప్స్‌లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Agnipath Protests Effect: 'అగ్నిపథ్' అల్లర్ల ఎఫెక్ట్.. విశాఖపట్నం రైల్వే స్టేషన్ మూసివేత..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.