Coronavirus Vaccine In AP : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీపై ఒక క్లారిటీని ఇచ్చారు. ఏపీ ప్రజలకు కరోనా టీకా ఇవ్వడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేస్తోందో వివరించారు జగన్. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన ఇవాళ జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో వైయస్ జగన్ తో పాటు ఇతర కీలక అధికారులు కూడా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కోవిడ్- 19 సెకండ్ వేవ్ తో పాటు పలు అంశాలపై చర్చించడానికి ప్రధాని ఈ సమావేశం నిర్వహించారు.Also Read : Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సమావేశంలో కరోనా వ్యాక్సిన్ ( Covid-19 Vaccine ) ముందుగా ఎవరికి ఇవ్వాలో చర్చించారు. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం ప్రణాళిక ఏంటో వివరించారు జగన్. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే పంపిణీ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.. 



అనంతరం ఉన్నతాధికారులతో సమావేశం అయిన ముఖ్యమంత్రి జగన్ ( YS Jagan ) కరోనావైరస్ టీకీ అందుబాటులోకి వచ్చాక దాన్ని ఎలా ప్రజలకు అందించాలో , అందుబాటులో ఉన్న విధానాలేంటో వాటిపై ఫోకస్ పెట్టమన్నారు. వ్యాక్సిన్ ను స్టోర్ చేయడంలో తలెత్తే సమస్యను గుర్తించాలి అని, టీకా నిల్వకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా, వాటిని రవాణా చేయడానికి విధివిధానాలు సిద్ధం చేయాలని అధికారులను సూచించారు. మారుమూల గ్రామాల్లోకి కూడా టీకా సరఫరా అయ్యేలా చూడాలి అన్నారు. త్వరలో దీనిపై సమీకా సమావేశం ఉంటుంది అని తెలిపారు.



Also Read | Zero Corona: కెనడాలోని ఈ ప్రాంతంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR