Chandrababu Super Six: అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ స్థానాలు గెలిచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పగ్గాలు చేపట్టనున్నాడు. ఆయన ప్రమాణస్వీకారం కోసం తాడేపల్లిలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం వారం రోజుల్లో కొలువుదీరనుంది. అధికారంలోకి వస్తున్న చంద్రబాబు ముందు చిక్కుముళ్లు ఎన్నో ఉన్నాయి. జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత హామీలతో రాష్ట్రాన్ని శ్రీలంక మాదిరిగా చేశారని విమర్శించిన చంద్రబాబు మరి వాళ్లు కూటమిగా ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మొదటి నుంచి చంద్రబాబుపై హామీలు నెరవేర్చని నాయకుడిగా గుర్తింపు ఉంది. ఈసారి ప్రజలు ఊహించని రీతిలో మెజార్టీ ఇవ్వడంతో మరి ఈసారైనా చంద్రబాబు తనపై ఉన్న ముద్రను చెడగొట్టుకుంటారా లేదా అని చర్చనీయాంశంగా ఉంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Modi Praises To Pawan: ఢిల్లీలో పవన్‌ కల్యాణ్‌ క్రేజ్‌ చూశారా.. క్లీన్‌ స్వీప్‌పై మోదీ ప్రశంసలు


 


మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గానూ 164 స్థానాల్లో జనసేన, బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ కూటమి సంచలన విజయం సాధించింది. ఎంపీల విషయానికొస్తే మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో 21 స్థానాలు కూటమి నెగ్గింది. ఇంతటి విజయంతో అధికారం చేపడుతున్న చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారని ప్రజల్లో చర్చ మొదలైంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బటన్‌ నొక్కడంతో ప్రతి కుటుంబానికి ఏదో ఒక రీతిలో ప్రభుత్వ సొమ్ములు దక్కాయి. ఎన్నికల సమయంలో జగన్‌ను మించి టీడీపీ నేతృత్వంలోని కూటమి హామీలు ఇచ్చింది. ప్రజలు వాటిని చూసి కూటమికి పట్టం కట్టారు.

Also Read: YSRCP Sensation: ఓటమి తర్వాత వైఎస్‌ జగన్‌ సంచలన నిర్ణయం.. పార్టీ ఆఫీసే ఎత్తివేత


మరి లెక్కకు మించి ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎల నెరవేరుస్తారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి భారీ అప్పులు ఉన్నాయి. దాదాపు 7 లక్షల అప్పులు ఉన్నాయని తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే కచ్చితంగా మళ్లీ అప్పులు చేయాల్సిందే. దీనికితోడు రాష్ట్ర బడ్జెట్‌ లోటులో ఉంది. మరి సూపర్‌ సిక్స్‌ పేరుతో ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టుకుంటారని ప్రజలు చర్చించుకుంటున్నారు. జగన్‌ పాలనను శ్రీలంకగా చెప్పిన చంద్రబాబు మరి తమ కూటమి ఇచ్చిన హామీలు చూస్తే కచ్చితంగా శ్రీలంక అవుతుందని పేర్కొంటున్నారు.


ముఖ్యమైన హామీలు
అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్సీపై చేస్తామని చంద్రబాబు చెప్పారు. అనంతరం వృద్దాప్య పింఛన్ నెలకు రూ.3 వేల నుంచి 4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు ఏప్రిల్ నుంచే అమలవుతుందని ప్రకటించారు కూడా. దీంతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే ఈ రెండూ హామీలను చంద్రబాబు తప్పక నెరవేర్చాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచుతామని చెప్పిన వీరు దానిని కూడా అమలు చేయాల్సి ఉంది.


వాలంటీర్లకు గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపు మరో ముఖ్యమైన హామీ ఇచ్చారు. అంతేకాకుండా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఆర్థిక సహాయం, ఆర్టీసీ బస్సుల్లో ప్రతి మహిళలకు ఉచిత ప్రయాణం వంటి హామీలను తక్షణమే అమలు చేయాల్సి ఉంది. రైతులకు పెట్టుబడి సహాయం, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, తల్లికి వందనం పేరిట పిల్లలకు ఒక్కో బిడ్డకు రూ.15 వేలు వంటి హామీల అమలు కష్టసాధ్యంగా ఉంది. మరి వీటన్నింటిని ఎలా అమలు చేస్తారని ప్రశ్నలు మొదలవుతున్నాయి. 


కేంద్రం సహాయంతో
ఎన్నికల్లో ఊహించని మెజార్టీతో గెలుపొందిన కూటమి ప్రభుత్వం కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ సహాయంతో సులువుగా హామీలు నెరవేర్చగలుగుతుందని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు చెబుతున్నారు. సంపదను సృష్టించి పేదలకు పంచుతామని చంద్రబాబు చెప్పారని.. దానికి తగ్గట్టు బాబు వద్ద విజన్‌ ఉందని గుర్తుచేస్తున్నారు. ఎలాగైనా హామీలు అమలుచేసి పదేళ్ల దాకా పరిపాలన సాగిస్తామని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter