YSRCP Sensation: ఓటమి తర్వాత వైఎస్‌ జగన్‌ సంచలన నిర్ణయం.. పార్టీ ఆఫీసే ఎత్తివేత

YS Jagan Decided To Shift YSRCP Central Office From Tadepalli To Camp Office: ఎవరూ ఊహించని రీతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యాలయాన్నే మార్చేయాలని నిర్ణయించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 6, 2024, 10:26 PM IST
YSRCP Sensation: ఓటమి తర్వాత వైఎస్‌ జగన్‌ సంచలన నిర్ణయం.. పార్టీ ఆఫీసే ఎత్తివేత

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో బోల్తా కొట్టడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర నైరాశ్యంలో మునిగింది. పార్టీ ఘోర పరాభవం ఎదుర్కోవడానికి కారణాలు తెలియడం లేదు. అయితే ఓటమి నుంచి తేరుకున్న జగన్‌ ఎన్నికల ఫలితాలపై అందుబాటులో ఉన్న నాయకులతో సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన నివాసంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతో చర్చించారు. ఈ సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

Also Read: Govt Advisers: వైఎస్‌ జగన్‌కు కాబోయే సీఎం చంద్రబాబు భారీ దెబ్బ.. వారంతా ఔట్‌

 

పార్టీ ఓటమికి కారణాలు అన్వేషిస్తున్న సమయంలో పార్టీ కేంద్ర కార్యాలయంపై కూడా చర్చించింది. ఈ సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం మార్చాలని జగన్‌ నిర్ణయించారు. ప్రస్తుతం జగన్‌ క్యాంప్‌ కార్యాలయాన్ని వైఎస్సార్‌సీపీ కార్యాలయం‌గా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. అది కూడా వెంటనే మార్చాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నెల 10వ తేదీ తర్వాత తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంగా మార్చివేయనున్నారు. ఇకపై అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.

Also Read: AP Govt Officers Tension: రెచ్చిపోయిన అధికారులకు షాక్‌.. సీఎంగా బాధ్యతలు చేపట్టకముందే ఆట మొదలెట్టిన చంద్రబాబు

 

అంతకుముందు జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. మళ్లీ గెలుస్తామని జగన్‌కు నాయకులు భరోసా ఇచ్చారు. ప్రజలకు మంచి చేశామని.. కచ్చితంగా పార్టీకి పునర్వైభవం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న సమయంలో వ్యవసాయం, విద్య, వైద్యం తదితర రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చినట్లు చర్చ జరిగింది.

ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై పార్టీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవీఎం మేనేజ్‌మెంట్‌ అనుమానాలు, ఈసీ, కొంతమంది పోలీసు అధికారుల కుట్రల నేపథ్యంలో కూడా సీట్లు గణనీయంగా తగ్గిపోయానని చర్చ జరిగింది. పార్టీకి పెట్టని కోటలా ఉన్న గ్రామాల్లో కూడా ఓట్లు రాకపోవడంపైనా ఈ సందర్భంగా అనుమానాలు లేవనెత్తారు. జగన్‌ పాలనను బాగుందని చెప్పడానికి 40 శాతం ఓటింగ్‌ రావడమే అని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల ముందుకు ధైర్యంగా వెళ్తామని నేతలు ప్రకటించారు.

దాడులపై ఆగ్రహం
ఇంకా అధికారంలోకి రాకముందే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న టీడీపీ దాడులు ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఎక్కడికక్కడ దాడులకు దిగుతున్నారని నాయకులు జగన్‌కు చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రాణాలకు హాని తలపెట్టడమే కాకుండా ఆస్తుల విధ్వంసాలకు దిగుతున్నారని వివరించారు. పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా జగన్‌ నాయకులకు సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News