Modi Praises To Pawan: ఢిల్లీలో పవన్‌ కల్యాణ్‌ క్రేజ్‌ చూశారా.. క్లీన్‌ స్వీప్‌పై మోదీ ప్రశంసలు

Narendra Modi Praises On JanaSena Chief Pawan Kalyan At NDA Meet: ఏపీ ఎన్నికల్లో వంద శాతం ఫలితం పొందిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్‌ కాదు తుఫాన్‌ అంటూ ప్రశంసించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 7, 2024, 04:11 PM IST
Modi Praises To Pawan: ఢిల్లీలో పవన్‌ కల్యాణ్‌ క్రేజ్‌ చూశారా.. క్లీన్‌ స్వీప్‌పై మోదీ ప్రశంసలు

Modi Praises On Pawan: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో పోటీ చేసి దేశం దృష్టిని ఆకర్షించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు దేశవ్యాప్త గుర్తింపు లభిస్తోంది. ఇన్నాళ్లు సినిమాలపరంగా గుర్తింపు పొందిన పవన్‌ ఎన్నికల ఫలితాలతో రాజకీయంగా జాతీయ గుర్తింపు దక్కుతోంది. తాజాగా జరిగిన ఎన్డీయే సమావేశంలో పవన్‌ కల్యాణ్‌పై జాతీయ నాయకులు ప్రశంసలు కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. పవన్‌ అనుకున్నారా తుఫాన్‌ అని ప్రశంసించారు.

Also Read: YSRCP Sensation: ఓటమి తర్వాత వైఎస్‌ జగన్‌ సంచలన నిర్ణయం.. పార్టీ ఆఫీసే ఎత్తివేత

దేశ రాజధాని ఢిల్లీలోని పాత పార్లమెంట్‌ భవనంలో శుక్రవారం ఎన్డీయే ఎంపీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్డీయేలోని పార్టీల ముఖ్య నాయకులంతా హాజరయ్యారు. అందరిలో ఏపీ నుంచి హాజరైన పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సభనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ పవన్‌పై ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేనాధిపతిపై ప్రశంసలు కురిపించారు. 'ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్‌. ఆయన పవన్‌ కాదు తుఫాన్‌' అంటూ ప్రధాని మోదీ కొనియాడారు. 'ఆంధ్రప్రదేశ్‌లో అద్భుత విజయం సాధించాం. ఏపీలో విజయం ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించింది. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లతో కలిసి ఏపీలో అద్భుత విజయం పొందాం. వారిద్దరి వలనే భారీ విజయం లభించింది' అని మోదీ తెలిపారు.

Also Read: Govt Advisers: వైఎస్‌ జగన్‌కు కాబోయే సీఎం చంద్రబాబు భారీ దెబ్బ.. వారంతా ఔట్‌

ఇదే సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌లు కూడా మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన నాయకత్వాన్ని బలోపేతం చేశారు. అనంతరం ఈ సమావేశంలో లోక్‌సభ పక్ష నాయకుడిగా నరేంద్ర మోదీని ఎన్డీయే పార్టీలన్నీ ఎన్నుకున్నాయి. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈనెల 12వ తేదీన ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణస్వీకారానికి దేశ, విదేశీ నేతలు తరలి రానున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

 

 

Trending News