Covid19 vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
Covid19 vaccination:కోవిడ్ 19 వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిన్ యాప్ రిజిస్ట్రేషన్ ఇక అవసరం లేకుండానే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎలాగంటే..
Covid19 vaccination:కోవిడ్ 19 వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిన్ యాప్ రిజిస్ట్రేషన్ ఇక అవసరం లేకుండానే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎలాగంటే..
దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా రెండవ దశ వ్యాక్సినేషన్(Second phase vaccination) కొనసాగుతోంది. ఫ్రంట్‌లైన్ వారియర్లు, హెల్త్‌కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ దాదాపు పూర్తయి వస్తోంది. ఇప్పుడు రెండవ దశలో 45 నుంచి 60 ఏళ్లలోపున్నవారు లేదా 60 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. అది కూడా కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న తరువాత సీరియల్ ప్రకారం ఇస్తున్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం (Ap government) కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక నుంచి 60 ఏళ్లు దాటినవారు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్(Online Registration) అవసరం లేకుండా ఏదైనా గుర్తింపు కార్డు చూపించి వ్యాక్సిన్ తీసుకోవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేయకపోయినా నేరుగా వ్యాక్సినేషన్ సెంటర్లకు వెళ్లి చేయించుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వైధ్యులచే ధృవీకరణ తీసుకోవల్సి ఉంటుంది. ధృవీకరణ పత్రం లేకపోతే రక్తపరీక్షల రిపోర్టులు, మందులు చీటీ వంటివి చూపిస్తే సంబంధిత వైద్యులు అవసరమైన ధృవపత్రాన్ని జారీ చేస్తారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లోనూ వ్యాక్సిన్ ఇస్తారని వైద్యాధికారులు తెలిపారు. ఆసుపత్రుల జాబితాను cowin.gov.inలో చూడవచ్చు.
Also read: AP Municipal Elections Counting: 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల కౌంటింగ్ రేపే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook