AP Municipal Elections Counting: 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల కౌంటింగ్ రేపే

AP Municipal Elections Counting: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో రేపు తేలిపోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాల్టీల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 13, 2021, 05:25 PM IST
 AP Municipal Elections Counting: 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల కౌంటింగ్ రేపే

AP Municipal Elections Counting: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో రేపు తేలిపోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాల్టీల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ (Ap Municipal Elections Counting) మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీలు, నగర పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఏలూరు కార్పొరేషన్, చిలకలూరి పేట మున్సిపాలిటీ కౌంటింగ్ ప్రక్రియకు హైకోర్టు బ్రేక్ వేసింది. మిగిలిన 11 కార్పొరేషన్లు 70 మున్సిపాలిటీల కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మరో నాలుగు నగర పంచాయితీలున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయడమే కాకుండా 144 సెక్షన్ విధించారు. 

కౌంటింగ్ కోసం కార్పొరేషన్‌లలో(Corporations Elections counting) 2204 టేబుల్స్, మున్సిపాలిటీల్లో 1822 టేబుల్స్ ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కోసం 2 వేల 376 కౌంటింగ్ సూపర్ వైజర్లు, 7 వేల 412 సిబ్బందిని ఏర్పాటు చేయగా..మున్సిపాలిటీల్లో 1941 సూపర్ వైజర్లు, 5 వేల 195 సిబ్బందిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత కోసం 20 వేల 419 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. వీరిలో డీఎస్పీ స్థాయి అధికారులు 172, సీఐలు 476, ఎస్ఐలు 1345 మంది,  17 వేల 292 మంది కానిస్టేబుళ్లు, ఇతరులు 1134మందిని ప్రభుత్వం నియమించింది. 11 కార్పొరేషన్లకు సంబంధించి 16 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 

విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల కౌంటింక్ కోసం రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సిద్ధమైంది. విశాఖపట్నం కార్పొరేషన్ కౌంటింగ్(Visakhapatnam corporation counting) ఆంధ్ర యూనివర్శిటీ (Andhra University) ప్రాంగణంలో జరగనుంది. విజయవాడ కార్పొరేషన్ కౌంటింగ్ ఆంధ్రా లయోల కళాశాలలో ఏర్పాటు కానుంది. మచిలీపట్నం కార్పొరేషన్ కౌంటింగ్ కృష్ణా యూనివర్శిటీలో జరగనుండగా..గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్  కోసం స్థానికంగా నాలుగు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇక ఒంగోలు కార్పొరేషన్ కౌంటింగ్ సెయింట్ గ్జావియర్ కళాశాలలో జరగనుంది. అనంతపుర కార్పొరేషన్‌కు సంబంధించిన కౌంటింగ్ ఎస్ఎస్‌బీఎమ్ కళాశాలలో జరగనుండగా..కర్నూలు కౌంటింగ్ స్ధానికంగా 3 కేంద్రాల్లో జరగనుంది. ఇక చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ పీవీకేఎన్ కళాశాలలో జరగనుంది. తిరుపతి కార్పొరేషన్ కౌంటింగ్ కోసం ఎస్‌వీ ఆర్ట్స్ కళాశాల ఎంపిక చేశారు. 

Also read: Regular trains: ప్రయాణీకులకు శుభవార్త, తిరిగి ప్రారంభం కానున్న రెగ్యులర్ రైళ్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News