Hyderabad city civil court issued notice to pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ అని చెప్పుకొవచ్చు. నవంబరు 22న తమ ముందు హజరుకావాలని కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. తిరుమల లడ్డు వివాదంలో ఒక న్యాయవాది పవన్ వ్యాఖ్యలపై కోర్టులో.. పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తొంది. తిరుమలలో కల్తీ లడ్డుల్ని  అయోధ్యకు పంపారని కూడా పవన్ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తొంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీని వల్ల చాలా మంది భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయని సదరు పిటిషన్ లో పేర్కొన్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో.. వచ్చే నవంబర్ 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి కూడా కోర్టు సమన్లు జారీచేసినట్లు తెలుస్తొంది. 


ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల లడ్డు వివాదం తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఇప్పటికే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లింది. అంతే కాకుండా.. దీనిపై ఏపీలోనే కాకుండా.. నేషనల్ మీడియాలో కూడా అనేక కథనాలు వెలువడ్డాయి.  సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో లడ్డు వివాదం గురించి బైటపెట్టారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు మిన్నంటాయి. అన్ని హిందు సంఘాలు దీన్ని ఖండిచాయి.


ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రాయిశ్చిత దీక్ష సైతం చేపట్టారు. సీఎం చంద్రబాబు ఏపీ వ్యాప్తంగా దేవాలయాలలో ప్రత్యేకంగా ప్రాయిశ్చిత పూజలు చేయాలని భక్తుల్ని కోరారు. ఈ క్రమంలో.. ఇటీవల న్యాయవాది రామారావు.. హైదరబాద్ సిటీ సివిల్  కోర్టులో పిటిషన్ లు దాఖలు చేశారు.  సెక్షన్ 91 ప్రకారం పవన్ కళ్యాణ్ ఫై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తొంది.


జనవరిలో నెలలో అయోధ్యకు పంపిన తిరుమల లడ్డూల్లో..  కల్తీ నెయ్యి వాడినట్టు పవన్ కల్యాణ్  వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తొంది. పవన్ వ్యాఖ్యల పట్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పిటిషన్ లో పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై విచారించిన సిటీ సివిల్ కోర్టు.. లడ్డు వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎస్ శాంతి కుమారీ, ప్రిన్సిపాల్ హోమ్ సెక్రెటరీ అధికారులకు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తొంది.


Read more: Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్.. సమన్లు జారీ చేసిన కోర్టు.. అసలేం జరిగిందంటే..?


అదే విధంగా.. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా, వెబ్‍సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు నుంచి తొలగించేలా సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును పిటిషనర్ కోరినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో  తదుపరి విచారణను కోర్టు నవంబర్ 22  సిటీ సివిల్ కోర్టు వాయిదా వేసినట్లు తెలుస్తొంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.