అమరావతి : ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి టికె రమామణి ( IAS Ramamani ) గురువారం కన్నుమూశారు. స్వల్ప అస్వస్థతకు గురైన రమామణి.. గురువారం సర్వ జన ఆసుపత్రికి వచ్చారు. వైద్యం అందిస్తుండగా రమామణి మృతి చెందారు. కర్నూలు జిల్లా నంద్యాలలో రమామణి స్వస్థలం. రాష్ట్ర సర్వీసుల నుండి పదోన్నతిపై 2010లో ఐఏఎస్‌కు ఎంపికైన టికె రమామణి తొలుత అనంతపురం జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత విజయవాడకు బదిలీపై వచ్చారు. 56 ఏళ్ల రమామణి వాణిజ్య పన్నులశాఖలో కార్యదర్శిగానూ పని చేశారు. గత రాత్రి ఆమె గుంటూరు పండరిపురంలో తన బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడుండగానే అనారోగ్యంతో ఆస్పత్రిపాలై మృతి చెందినట్టు తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ రమామణి ఇక లేరని తెలియగానే ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ హుటాహుటిన తరలివచ్చారు. ( Read also : ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 1024 కేసులు నమోదు )


రమామణి పార్ధీవదేహన్నీ ప్రవీణ్ ప్రకాష్‌తో పాటు జిల్లా కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, ప్రశాంతి, ఆర్డీవో భాస్కర్ రెడ్డి తదితరులు సందర్శించి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. రమామణి భర్త మురళీమోహన్‌తో పాటు ఆమె కుటుంబసభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. రమామణి తండ్రి టి కె ఆర్ శర్మ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు కావడంతో పాటు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి శాసనసభ్యులుగానూ వ్యవహరించారు. టికె రమామణి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారుల సంఘం సంతాపం వ్యక్తం చేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..