హైదరాబాద్: శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిని పోలీసులు నగర బహిష్కరణ చేయడాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ నేతలు..ఈ అంశాన్ని గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకొచ్చారు. స్వామి పరిపూర్ణానందను అన్యాయంగా గృహనిర్బంధం నిర్భంధం చేశారని.. సరైన కారణాలు లేకుండా నగర బహిష్కరణ చేశారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరుపై విచారణ జరిపించాలని ఈ సందర్భంగా గవర్నర్ కు విజప్తి చేశారు. కాగా గవర్నర్ ను కలిసిన వారిలో బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ  నేతలు ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం
గవర్నర్ కలిసిన తర్వాత బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. స్వామి పరిపూర్ణానందను ఎందుకు గృహనిర్బంధం చేయాల్సి వచ్చిందో పోలీసుల వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సరైన కారణం లేకుండా పరిపూర్ణానంద స్వామికి ఆర్నెళ్ల పాటు హైదరాబాద్ నగర బహిష్కరణ అన్యాయమన్నారు. ఇదే అంశాన్ని గవర్నర్ దగ్గర ప్రస్తావించామని.. దీనిపై విచారణకు ఆదేశించాల్సిందిగా కోరామన్నారు. స్వామి పరిపూర్ణనంద విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఈ సందర్భంగా దత్తాత్రేయ తప్పుబట్టారు. స్వామి పరిపూర్ణానంద విషయంలో ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుందని దత్తాత్రేయ కేసీఆర్ సర్కార్ ను దయ్యబట్టారు.


హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ స్వామి పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. పౌరల పట్ల ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తే వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత గవర్నర్ కు ఉంటుందని అందుకే ఈ ఘటనపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వ వైఖరి హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ ను కిషన్ రెడ్డి విమర్శించారు.