IMD Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న మూడ్రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంక కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర ఒడిశా తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం వ్యాపిస్తోంది. అటు అల్పపీడనం, ఇటు ఉపరితల ఆవర్తనానికి తోడుగా ఇప్పటికే బలపడిన నైరుతి రుతు పవనాలున్నాయి. దాంతో రెండు రాష్ట్రాల్లోనూ గత రెండ్రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న మూడ్రోజులు కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదిలాబాద్, కొమురం భీమ్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. 


ఇక ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ అయింది. రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, మచిలీపట్నం, గన్నవరం, భీమవరం, అమలాపురం, కాకినాడ, అన్నవరం ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు, నంద్యాల, సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. తూర్పు గోదావరి, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ , ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. 


Also read: New Sim Card Rules: కొత్త సిమ్ కార్డు, ఎంఎన్‌పి ఇకపై అంత సులభం కాదు, జూలై 1 నుంచి కొత్త రూల్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook