హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర, తూర్పు తెలంగాణలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అధికారులు.. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 


ఇదిలావుంటే, మరోవైపు వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని వున్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురవడంతోపాటు తీరం వెంబడి 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అన్నారు. ఆ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా వుంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.