AP Rains Alert: ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్
Rains Alert For Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Rains Alert For Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ను భారీ వర్షాలు వీడడం లేదు. ఈశాన్య రుతుపవనాలు ప్రారంభంతో సోమవారం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరప్రాంతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతుపవనాలు ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.
ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు,కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మంగళవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. రేపు (బుధవారం) కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి.. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అత్యధిక వర్షపాతం నెల్లూరు జిల్లా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సమయంలో కోస్తాంధ్రలో 338.1 మి.మీ, రాయలసీమలో 223.3 మి.మీ వర్షపాతం నమోదవుతుంది. ఈ సారి అంతకు మించి నమోదయ్యే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాల కంటే.. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతోనే బంగాళాఖాతంలో తుఫానులు ఏర్పడతాయని అంటున్నారు. వీటి ఎఫెక్ట్ దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు రాష్ట్రాలపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా ఈ సీజన్‌లో అక్టోబర్ నుంచి డిసెంబర్‌ల మధ్యలో కనీసం మూడు తుఫానులు ఏర్పడుతుండగా.. ఈసారి ఇంకా తుఫానులు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు.
Also Read: Huzurnagar Death Case: కన్నకొడుకును హత్య చేయించిన తల్లిదండ్రులు.. చిన్న తప్పుతో దొరికిపోయారు
Also Read: India Vs Bangladesh: రేపు బంగ్లాతో భారత్ ఢీ.. పంత్ ప్లేస్‌పై రాహుల్ ద్రావిడ్ ట్విస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook