Rishabh Pant Or Dinesh Karthik For India Vs Bangladesh: టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా కీలక సమరానికి సిద్ధమవుతోంది. అడిలైడ్ వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సెమీఫైనల్‌కు చేరుకోవడం ఖాయం. ప్రస్తుతం భారత్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక ఓటమితో 4 పాయింట్లతో గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌పై గెలిస్తే భారత్ 6 పాయింట్లకు చేరుకోవడంతోపాటు సెమీఫైనల్‌లో దాదాపు బెర్త్ కన్ఫార్మ్ అవుతుంది.
రేపు టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గాయపడిన దినేష్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్ వస్తాడని అందరూ అనుకుంటున్న సమయంలో కోచ్ రాహుల్ ద్రావిడ్ ట్విస్ట్ ఇచ్చారు. రేపు మ్యాచ్‌కు ముందు దినేష్ కార్తీక్ ఫిట్‌నెస్ చూసిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోగా.. దినేష్ కార్తీక్ వెన్నులో గాయంతో మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయారు. కార్తీక్ స్థానంలో పంత్ కీపింగ్ చేశాడు. తరువాత మ్యాచ్‌కు దినేష్ కార్తీక్ దూరమవుతాడని ప్రచారం జరిగింది.
మంగళవారం మీడియాతో రాహుల్ ద్రావిడ్ మాట్లాడారు. 'కార్తీక్ బౌన్సర్‌ను పట్టుకోవడానికి గాలిలోకి దూకి దినేష్ కార్తీక్ దురదృష్టవశాత్తూ గాయపడ్డాడు. నేలపై ల్యాండ్ సమయంలో తప్పుగా పడిపోవడంతో వెన్నులో గాయమైంది. ప్రస్తుతం కార్తీక్ పరిస్థితి మెరుగ్గా ఉంది. ప్రాక్టీస్‌లో కూడా పాల్గొన్నాడు. అతని ఫిట్‌నెస్ ఎలా ఉంటుందో రేపు చూద్దాం. ఫిట్‌నెస్ చూసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం..' అంటూ చెప్పుకొచ్చారు.
ద్రావిడ్ సమాధానంతో తుది జట్టులో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్‌ను తీసుకోవాలని డిమాండ్స్ వస్తున్నాయి. ఒకవేళ మ్యాచ్ సమయానికి కార్తీక్ ఫిట్‌గా ఉంటే పంత్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. రాహుల్ స్థానంలో పంత్‌ను జట్టులోకి తీసుకుంటే.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తాడు.
సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌ను కూడా పక్కన పెట్టాలని మాజీలు సూచిస్తున్నారు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ అశ్విన్ పెద్దగా ఆకట్టుకోలేదు. సఫారీతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి 41 పరుగులు సమర్పించుకున్నాడు. కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. దీంతో అశ్విన్ స్థానంలో చాహల్‌ను తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. చూడాలి మరి రేపు ఎవరు బరిలోకి దిగుతారో..!
Also Read: Team India: ఈ టీమిండియా ఆటగాడికి లక్కీ ఛాన్స్.. ఒకేసారి మూడు టీమ్స్‌లో చోటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook