Southwest Monsoon: ఏపీలో నైరుతి ప్రభావం.. మరో 3 రోజుల తరువాతే వర్షాలు
Southwest Monsoon: తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిగా మారాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా జాడలేకుండా పోయాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో నైరుతి రుతు పవనాలు విస్తరించేందుకు మరో 2-3 రోజులు ఆగాల్సిందేనంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.
Southwest Monsoon: గతంలో ఎన్నడూ లేనివిధంగా జూన్ మూడోవారం వచ్చేసినా ఎండల తీవ్రత తగ్గడం లేదు. దాదాపు పదిరోజులు ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాల ప్రభావం కన్పించడం లేదు. పూర్తి స్థాయిలో రుతు పవనాలు విస్తరించకపోవడమే కారణంగా తెలుస్తోంది. మరి ఈ సమస్య ఎప్పటి వరకు..
ఏపీలో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా జూన్ నెలలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 443-48 మధ్యలో ఉంటున్నాయంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. నిన్న అంటే జూన్ 16వ తేదీన రాజమండ్రిలో ఈ సీజన్ గరిష్టం మరోసారి నమోదైంది. ఏకంగా 48.5 డిగ్రీలు ఉండటంతో జనం విలవిల్లాడిపోయారు.
రుతుపవనాలు ఎప్పుడనే చర్చతో పాటు జూన్ 12న ప్రవేశించిన రుతుపవనాలు ఏమయ్యాయనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. ఈసారి జూన్ నెలలో సాధారణం కంటే 6-10 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. వాతావరణం ఎప్పుడెప్పుడు చల్లబడుతుందా, ఎప్పుడు వర్షాలు కురుస్తాయా అని ఎదురుచూసేవారికి ప్రతిరోజూ నిరాశే ఎదురౌతోంది.
Also Read: Weather Updates: భారీ ఎండల నుంచి ఉపశమనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు
ప్రతియేటా జూన్ 1-4 తేదీల మధ్యలో ఏపీలో ప్రవేశించే రుతుపవనాలు ఈసారి జూన్ 12న అంటే 10 రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి. కేరళలో సైతం జూన్ 8న ప్రవేశించాయి. అయితే జూన్ 12న ఏపీలో ప్రవేశించిన రుతుపవనాలతో ఇక వాతావరణం చల్లబడుతుందని భావించారు. కానీ రాయలసీమలోని పుట్టపర్తి, నెల్లూరులోని శ్రీహరికోట దాటి ఇతర ప్రాంతాలకు విస్తరించడం లేదు. అంటే రుతుపవనాల విస్తరణ ఆగిపోయింది. దాంతో వర్షాలు మచ్చుకైనా కన్పించడం లేదు. మరోవైపు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. దీని కారణం వాయువ్య గాలులని..రాజస్తాన్ వైపు నుంచి వస్తున్న పొడిగాలుల ప్రభావమని చెబుతున్నారు.
ఇప్పుడు నైరుతి రుతుపవనాల విస్తరణపై వాతావరణ శాఖ అప్‌డేట్ అందించింది. రాష్ట్రంలో రుతు పవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని మరో రెండ్రోజుల తరువాత రాష్ట్రమంతా విస్తరించవచ్చని ఐఎండీ తెలిపింది. ఈ నెల 18-21 తేదీల మధ్యలో రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు విస్తరించవచ్చని తెలుస్తోంది. అంటే ఈ నెల 19-20 తేదీల్నించి రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు ప్రారంభం కావచ్చని ఐఎండీ అంచనా. రాష్ట్రమంతా వర్షాలు పడేందుకు మరో 6 రోజుల సమయం పట్టవచ్చు. కోస్తాంధ్రలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మరో 3 రోజుల తరువాత పడే అవకాశాలున్నాయి.
అయితే ఎండల తీవ్రత మాత్రం అప్పటి వరకూ తప్పదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరో 2-3 రోజులు భారీ ఉష్ణోగ్రతలు తప్పవంటున్నారు.
Also Read: Ambati Rayudu: పొలిటికల్ పిచ్‌పై బ్యాటింగ్‌కు అంబటి రాయుడు రెడీ.. అక్కడి నుంచే పోటీ..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook