Heavy Rain Alert To AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదురు గాలులకు వడగళ్లు వాన కురుస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. ఆదివారం, సోమవారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం తమిళనాడు నుంచి మధ్యప్రదేశ్ వరకు రాయలసీమ, తెలంగాణ మీదుగా ద్రోణి కొనసాగుతుందని వెల్లడించారు. విస్తారంగా వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు పొలాల్లో పనిచేసే కూలీలు, పశు గొర్రె కాపరులు చెట్ల కింద ఉండరాదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని కోరుతున్నారు. 


రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షం కురుస్తుండడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల పంట నష్టం సంభవించడంతో లబోదిబోమంటున్నారు. ధాన్యం కల్లాల్లోకి నీళ్లు చేరాయని.. పండిన పంట మొత్తం వర్షం పాలైందని వాపోతున్నారు. అదేవిధంగా ఉద్యాన పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రహదారులు దెబ్బతినడంతో ప్రయాణాలకు ఆటంకం ఏర్పడుతోంది. భారీస్థాయిలో వడగళ్ల వర్షాలు కురవడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. 


వచ్చే రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీసే అవకాశం ఉందని అంటున్నారు. బంగాళాఖాతం నుంచి అరేబియన్ తీరం వరకూ అంటే ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ వరకూ సమద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చిరు జల్లులు, మోస్తరు వర్షాలు కురవగా.. మరికొన్ని చోట్ల భారీ వడగళ్ల వర్షాలు కురిశాయి. 


Also Read: Ecuador Earthquake: ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 14 మంది మృతి  


Also Read: New Income Tax Rules 2023: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. తప్పకుండా తెలుసుకోండి  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి