New Income Tax Rules From April 2023: మార్చి 31వ తేదీతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY23) ముగియనుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (FY24) ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి అనేక నిబంధనల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇన్‌కమ్‌ట్యాక్స్‌కు సంబంధించిన అనేక నియమాలు కూడా మారబోతున్నాయి. ఈ మార్పులు ఫిబ్రవరిలో సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. మరి కొద్ది రోజుల్లో ఎలాంటి మార్పులు జరగనున్నాయో పన్ను చెల్లింపుదారులు తెలుసుకోండి.
వేతనదారులకు TDS తగ్గింపు
వచ్చే నెల నుంచి కొత్త పన్ను విధానంలో జీతభత్యాలు లబ్ధి పొందనున్నారు. అలాంటి వారికి ఇప్పుడు టీడీఎస్ తగ్గనుంది. పన్ను చెల్లించదగిన ఆదాయం రూ.7 లక్షల కంటే తక్కువగా ఉన్న, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న పన్ను చెల్లింపుదారులకు ఎటువంటి టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 87ఏ కింద అదనపు మినహాయింపు ఇచ్చారు.
లిస్టెడ్ డిబెంచర్లపై TDS
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 193 నిర్దిష్ట సెక్యూరిటీలకు సంబంధించి చెల్లించే వడ్డీపై టీడీఎస్ మిహాయింపు ఉంటుంది. సెక్యూరిటీ డీమెటీరియలైజ్డ్ రూపంలో ఉండి.. గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా చేసి ఉంటే.. అటువంటి సందర్భాలలో చెల్లించే వడ్డీపై టీడీఎస్ కట్ అవ్వదు. ఇది మినహా మిగిలిన అన్ని చెల్లింపులపై 10 శాతం టీడీఎస్ కట్ అవుతుంది.
ఆన్‌లైన్ గేమ్‌లపై ట్యాక్స్
ఆన్‌లైన్ గేమ్‌లు ఆడి డబ్బు గెలిస్తే.. ఇక నుంచి ఆ ఆదాయంపై భారీ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని కొత్త సెక్షన్ 115 బీబీజే ప్రకారం.. ఆన్‌లైన్ గేమ్ నుంచి గెలుచుకున్న డబ్బుపై 30 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను టీడీఎస్‌గా కట్ చేస్తారు.
తగ్గనున్న ప్రయోజనాలు
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54, 54ఎఫ్ కింద లభించే ప్రయోజనాలు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి తగ్గనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సెక్షన్ల కింద రూ.10 కోట్ల వరకు మూలధన లాభంపై మినహాయింపు ఉంటుంది. దీని కంటే ఎక్కువ మూలధన లాభం ఇండెక్సేషన్ ప్రయోజనంతో 20 శాతం చొప్పున ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
మూలధన లాభాలపై అధిక పన్ను
ఏప్రిల్ 1 నుంచి ఆస్తి అమ్మకం ద్వారా వచ్చే లాభంపై అధిక మూలధన లాభాల ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సెక్షన్ 24 కింద క్లెయిమ్ చేసిన వడ్డీ కొనుగోలు లేదా మరమ్మతు ఖర్చులో యాడ్ అవ్వదు. దీంతో మార్కెట్-లింక్డ్ డిబెంచర్ల బదిలీ, రిడెంప్షన్ లేదా మెచ్యూరిటీ నుంచి ఉత్పన్నమయ్యే మూలధన లాభాలు ఇప్పుడు స్వల్పకాలిక మూలధన లాభాల ట్యాక్స్‌ను ఆకర్షిస్తాయి.
బంగారం విషయంలో ఈ మార్పు
మీ దగ్గర ఉన్న బంగారాన్ని ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్ (ఈజీఆర్)గా లేదా ఎలక్ట్రానిక్ బంగారు రశీదును బంగారంగా మార్చినట్లయితే.. మీరు దానిపై ఎటువంటి మూలధన లాభాల ట్యాక్స్‌ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ ప్రయోజనాన్ని పొందడానికి సెబీ రిజిస్టర్డ్ వాల్ట్ మేనేజర్ నుంచి ఛేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: PF Account: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మీ అకౌంట్ చెక్ చేసుకోండి
Also Read: Loan Costly: కస్టమర్లకు షాకిచ్చిన మరో బ్యాంక్.. ఈఎంఐలపై భారీ మోత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి