Heavy Rains: ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ, ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ హెచ్చరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది. ఇవాళ ఉత్తర ఒడిశా, ఛత్తీస్‌గడ్ పరిసరాల్లో సముద్రమట్టానికి కేవలం 1.5 కిలోమీటర్ల ఎత్తువరకూ విస్తరించి ఉంది. ఫలితంగా ఇవాళ్టి నుంచి మూడ్రోజుల వరకూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలంగాణ, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షాలు పడవచ్చని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు. 


ఏపీ, తెలంగాణలో నమోదైన వర్షపాతం వివరాలు


నిన్న అర్ఙరాత్రి నుంచి తెలంగాణ,ఏపీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఏపీలో అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా కొమరాడలో 7 సెంటీమీటర్లు, విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక తెలంగాణలోని కల్వకుర్తిలో 16 సెంటీమీటర్ల, పెదపల్లిలో 9 సెంటీమీటర్లు, , నల్గొండలో 8 సెంటీమీటర్లు, మంధనిలో 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్‌లో 3 సెంటీమీర్లు, వరంగల్‌లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 


ఇక తెలంగాణ నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ నర్శాపురం, జగిత్యాల తదితర ప్రాంతాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ వెల్లడించింది. ఇటు ఏపీలోని విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడజా అతి భారీ వర్షాల హెచ్చరిక పొంచి ఉంది. భారీ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఇవాళ సాయంత్రం శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పొంచి ఉన్నాయి.  


Also read: Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు.. కొస్తాంధ్ర, గోదావరి జిల్లాలో అర్ధరాత్రి కుండపోత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook