Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను ఏపీ, చెన్నైలో బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, సుడిగాలులు, ఈదురుగాలులు ఏపీని వణికించాయి. ఇప్పుడు మరోసారి వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడిస్తోంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు వర్షసూచన జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిచౌంగ్ తుపాను ఏపీని వణికించేసింది. తీరం దాటే సమయంలో కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. కోతకు సిద్ఘంగా ఉన్న పంట నీళ్లలో మునిగి రైతాంగానికి తీవ్ర నష్టం ఏర్పడింది. అప్పటికే కోసి పొలాల్లో, ఆరుబయట కుప్పలుగా పోసి ఉన్న ధాన్యం తడిసిముద్దయింది. మిచౌంగ్ తుపాను ప్రస్తుతంత అల్పపీడనంగా మారి దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. ఫలితంగా రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే తుపాను కారణంగా భారీ వర్షాలతో అతలాకుతలమైన రైతాంగం మరోసారి వర్షాలంటే ఆందోళన చెందుతోంది. 


రానున్న 24 గంటల్లో ఏపీలోని కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సితారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని అంచనా. తపాను ప్రభావం పోయినా ఏపీలో అక్కడక్కడా ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో అనకాపల్లిలోని ఎలమంచిలిలో 75.2 మిల్లీమీటర్లు, చోడవరంలో 74, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 66, కాకినాడ జిల్లా తునిలో 59, పాడేరులో 56, నర్శీపట్నంలో 45, ఇచ్చాపురంలో 43, విజయనగరం జిల్లా వేపాడలో 37, అనకాపల్లిలో 36, చింతపల్లిలో 33, ఎస్ కోటలో 31, మదనపల్లిలో 21, పార్వతీపురం మన్యంలో 21 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 


వర్షాలు ఆగి ఎండలు కాస్తే తడిసిన ధాన్యం కాస్తైనా ఎండబెట్టుకునే ఆలోచనలో ఉన్న రైతాంగానికి మరోసారి వర్షాలనేసరికి ఆందోళన చెందుతున్నారు. 


Also read: Double Entry Votes: ఒక వ్యక్తికి ఒకటే ఓటు, డబుల్ ఎంట్రీ ఓట్లపై చర్యలకు దిగిన ఎన్నికల సంఘం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook