AP Heavy Rains: బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ క్రమంలో భారీ వర్షాలు మరో నాలుగు రోజులు తప్పేట్టు లేవు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ వైపు ఉపరితల ఆవర్తనం, మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. రేపు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. పరిస్థితి అనుకూలిస్తే ఈ వాయుగుండం తుపానుగా మారే అవకాశాలు లేకపోలేదని ఐఎండీ చెబుతోంది. తుపానుగా మారినా మారకపోయినా 24వవ తేదీలోగా ఒడిశాలోనే తీరం దాటనుంది. ఇది చాలదన్నట్టు 29వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. ఇటు రుతు పవనద్రోణి రాజస్థాన్ నుంచి పశ్చిమ మద్య బంగాళాఖాతం వరకూ ఉండటం రానున్న 4 రోజులు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. అదే సమయంలో మరో అల్పపీడనం నేపధ్యంలో ఆగస్టు 3 వరకూ రాష్ట్రంలో వర్షాలు కొనసాగవచ్చు.


ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు తోడు గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల్లో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ నుంచి 51 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. రాష్ట్రమంతా వర్షాలు కురిసే అవకాశాలున్నా ముఖ్యంగా కృష్ణా, నెల్లూరు, ఉభయ ఉమ్మడి గోదావరి, విశాఖ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు పడవచ్చని తెలుస్తోంది. 


Also read: UCC Bill: ముస్లింలను నొప్పించేలా ఏ పనీ చేయం, యూసీసీపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook