ఆసీస్‌ గడ్డపై సిరీస్ గెల్చుకోవాలనే టీమిండియా చిరకాల స్వప్నం నిజం చేసుకునే గడియలు దగ్గరపడుతున్నాయి.  సిరీస్ ఫలితాన్ని తేల్చే చిట్టచివరిదైన నాల్గో టెస్టు మ్యాచ్ లో కోహ్లీసేన మ్యాచ్ పై పట్టుబిగింది. తొలి ఇన్నింగ్ లో  622/7 పరుగుల భారీ స్కోర్ సాధించిన కోహ్లీ సేన ఇన్నింగ్ ను డిక్లేర్ చేసి ఆసీస్ కు బ్యాటింగ్ అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో వికెట్ పడకుండా ఆసీస్ జగ్రత్త పడ్డారు..మూడో రోజు ఆటలో భారీ భాగస్వామ్యాలు నెలకోల్పాలన్న వారి కోరిక నెరవేరలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసీస్ కు అడ్డుకట్ట వేసిన కుల్దీప్,జడేజా


మూడో రోజు ఆటలో భాగంగా 24/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో మ్యాచ్‌ ప్రారంభించిన ఆసీస్‌ బ్యాట్స్ మెన్లను టీమిండియా బౌలర్లు నిలదొక్కుకునే అవకాశం ఇవ్వలేదు. ప్రధానంగా స్పిన్నర్లు కుల్దీప్, జడేజాలు బౌలింగ్ ఎదుర్కొనేందుకు ఆసీస్ బ్యాట్స్ మెన్ల తెగఇబ్బంది పడ్డారు.  ఇలా మూడో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు పగడ్భందీ గా బౌలింగ్ చేస్తూ బ్యాట్స్ మెన్ల దూకుడు బ్రేక్ వేశారు. ఫలితంగా రోజు ఆట ముగిసే సమయానికి 83 ఓవర్లు ఆడిన ఆసీస్‌ జట్టు కీలక ఆరువికెట్లు  కోల్పోయి 236 పరుగులు మాత్రమే చేసింది. 


ఫాలో ఆన్ ప్రమాదంలో ఆసీస్


ఆసీస్ చేతిలో ఇంకా నాలుగు వికెట్ల మాత్రమే ఉన్నాయి...ఇంకా 386 పరుగలు వెనకబడి ఉన్నారు. మరో 186 పరుగుల చేస్తేగానీ ఫాలోఆన్ గండం నుంచి తప్పించుకోలేరు. ఇంకా రెండో రోజుల ఆట మిగిలిఉన్న నేపథ్యంలో కనీసం డ్రా చేసుకునే గట్టెక్కాలన్నీ ముందు ఫాలోఆన్ గండం నుంచి బయటపడాలి. అయితే పిచ్ స్వభావం, టీమిండియా దూకుడు బట్టి చూస్తే ఆసీస్ కు డ్రా చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు..


రేపే మ్యాచ్ ముగించాలనుకుంటున్న కోహ్లీసేన
ఇదిలా ఉండగా రేపు సాధ్యమైనన్ని వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను ఫాలోఅన్ లో పడేయాలని టీమిండియా భావిస్తోంది. గత టెస్టు మాదిరిగా కాకుండా ఈ సారి ఆసీస్ ఫాలోఅన్ ఆడించి చిత్తు చేయాలని కెప్టెన్ కోహ్లీ భావిస్తున్నాడు. పరిస్థితులు అనుకూలిస్తే రేపే మ్యాచ్ ను ముగించాలని టీమిండియా భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో ఆసీస్ ఏ మేరకు గట్టెక్కుతుందనేది..రేపటి ఆటలో తేలిపోతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ తీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది