Rafale: ఏకకాలంలో పాకిస్తాన్,చైనాలతో యుద్ధానికి సై
రఫేల్ యుద్దవిమానాలు. శత్రువు పసిగట్టేలోగా మెరుపువేగంతో దాడులు చేయగల సామర్ద్యం కలిగినవి. రఫేల్ రాకతో ఏకకాలంలో పాకిస్తాన్, చైనాతో యుద్ధం చేసే సామర్ధ్యం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు వచ్చింది.
రఫేల్ (Rafale ) యుద్దవిమానాలు. శత్రువు పసిగట్టేలోగా మెరుపువేగంతో దాడులు చేయగల సామర్ద్యం కలిగినవి. రఫేల్ రాకతో ఏకకాలంలో పాకిస్తాన్, చైనాతో యుద్ధం చేసే సామర్ధ్యం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ( Indian Airforce )కు వచ్చింది.
భారత ఆయుధ శ్రేణిలో రఫేల్ యుద్ధ విమానాలు రావడంతో ప్రత్యర్ధులపై పైచేయి సాధించామని తొలిసారిగా శక్తివంతంగా దాడిచేసే సామర్థ్యం అందివచ్చిందని వైమానిక దళం చీఫ్ ఆర్‌కేఎస్ భడౌరియా తెలిపారు. సరిహద్దుల్లో చైనా ( China ) , పాకిస్తాన్ ( Pakistan ) లతో ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో ఇరు దేశాలతో ఏకకాలంలో యుద్ధం చేసేందుకు సిద్థమయ్యామన్నారు. లడాఖ్ ( Ladakh ) లో చైనా దూకుడును ఈ ఏడాది మే నెలలోనే గుర్తించామని, అప్పటినుంచి సైనం వైమానిక దళం వేగంగా స్పందిస్తున్నాయని భడౌరియా అన్నారు. సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనా సేనలు మోహరించి విస్తృతంగా సైనిక విన్యాసాలు చేస్తున్నాయన్న విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. పలు అంశాల్లో పాకిస్తాన్ చైనాపై ఆధారపడుతోందని కూడా చెప్పారు. యుద్ధం రఫేల్ యుద్దవిమానాలు. శత్రువు పసిగట్టేలోగా మెరుపువేగంతో దాడులు చేయగల సామర్ద్యం కలిగినవి. రఫేల్ రాకతో ఏకకాలంలో పాకిస్తాన్, చైనాతో యుద్ధం చేసే సామర్ధ్యం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు వచ్చింది.
యుద్ధ పరిస్థితులు తలెత్తితే భారత్‌పై చైనా పైచేయి సాధించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. లడాఖ్ సహా కీలక ప్రాంతాల్లో భారత సైన్యం మోహరించిందని, పాక్-చైనాలతో ( Pak-china ) తలపడేందుకు సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు భారీగా సేనలను మోహరించామని చెప్పారు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన ఐదు రాఫేల్ యుద్ధవిమానాలు సెప్టెంబర్ 10న భారత ఎయిర్ ఫోర్స్ లో చేరిన సంగతి తెలిసిందే. Also read: Student thrashed: విద్యార్థి షర్ట్ ఊడదీసి, కొట్టి, వీడియో తీసిన స్టూడెంట్స్.. అమ్మాయి కోసమే ఘర్షణా ?