12వ తరగతి చదువుతున్న యువకుడిని తోటి విద్యార్థులే బట్టలూడదీసి కర్రలు, బెల్టులతో కొట్టిన ఘటన ( student thrashed, forced to strip ) ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ హింసాకాండను వీడియో తీసిన నిందితులు ( Attack filmed by accused).. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం అతడు చదువుతున్న విద్యా సంస్థకు చెందిన 10వ తరగతి విద్యార్థులే ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఓ అమ్మాయి విషయంలో తలెత్తిన వివాదమే ( Students fight for a girl ) ఈ ఘర్షణకు దారితీసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సెప్టెంబర్ 28న మధ్యాహ్నం 1 గంటకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.
టైమ్స్ నౌ ప్రచురించిన ఓ కథనం ప్రకారం 12వ తరగతి చదువుతున్న విద్యార్థి తన స్కూల్‌కే చెందిన 10వ తరగతి విద్యార్థినిని కలిసేందుకు తన కారులో వెళ్లాడు. అదే కారులో మరో ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు. విద్యార్థి కారులోంచి దిగి వెళ్లి ఆ అమ్మాయితో మాట్లాడుతుండగానే అక్కడికి చేరుకున్న మరో నలుగురు విద్యార్థులు అతడిని కొట్టడం ప్రారంభించారు. విద్యార్థుల బారి నుంచి తమ స్నేహితుడిని రక్షించడానికి కారులో ఉన్న స్నేహితులు ప్రయత్నించినప్పటికీ నిందితులు వారికి ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. Also read : CBI raids: కాంగ్రెస్ కీలక నేత ఇంట్లో సీబీఐ సోదాలు
తన కారులోనే తనని ఎక్కించుకుని సమీపంలోని గోవిందాపురం అటవీప్రాంతంలోకి ( Govindapuram forest in Ghaziabad ) తీసుకెళ్లిన విద్యార్థులు.. అక్కడ మరోసారి తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సోషల్ మీడియా ఎకౌంట్స్ డీయాక్టివేట్ చేయడంతో పాటు తన షర్ట్ ఊడదీసి కర్రలు, బెల్టులతో కొట్టినట్టు బాధితుడు పోలీసులకు తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారని బాధితుడు వాపోయాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన విజువల్స్ ( Attack caught on CCTV cameras ) పరిశీలించిన పోలీసులకు.. అక్కడ యువకుడిపై విద్యార్థులు దాడికి పాల్పడి దృశ్యాలు రికార్డయినట్టు వెల్లడించారు. పథకం ప్రకారం జరిగిన ఈ దాడి వెనుక అమ్మాయి పాత్ర కూడా ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు ( Police investigation ) జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. Also read : Hathras Gang Rape Case: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe