Amrit Bharat Stations: దేశవ్యాప్తంగా నిర్మించతలపెట్టిన అమృత్ భారత్ రైల్వే స్టేషన్లలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్దఎత్తున రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నారు. అమృత్ భారత్‌లో భాగంగా తొలి దశలో ఏపీలో 34, తెలంగాణలో 15 రైల్వే స్టేషన్లు ఆధునీకరించనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా రైల్వేల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 843.54 కోట్ల వ్యయంతో ఏపీలో 34, తెలంగాణలో 15 రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నారు. దేశవ్యాప్తంగా ఇలా మొత్తం 500 రైల్వే స్టేషన్లకు ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారు. మరో 1500 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లకు కూడా భూమి పూజ చేయనున్నారు. అమృత్ భారత్ పధకంలో భాగంగా రైల్వే స్టేషన్లు ఆధునీకరించడంతో పాటు ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కలగజేయనున్నారు. ఈ పధకం కింద ఏపీలో మొత్తం 72 రైల్వే స్టేషన్లు ఆదునీకరిస్తున్నారు. 


తొలిదశలో 270 కోట్ల ఖర్చుతో అనకాపల్లి, భీమవరం, ఏలూరు, కాకినాడ, తాడేపల్లి గూడెం, నర్శాపూర్, నిడదవోలు, ఒంగోలు, సింగరాయకొండ, తెనాలి, తుని రైల్వే స్టేషన్లు అభివృద్ధికి నోచుకోనున్నాయి. తరువాత రెండో దశలో బాపట్ల, చీరాల, ఆదోని, అనంతపురం, అనపర్తి, కంభం, ధర్మవరం, చిత్తూరు, గుడివాడ, గిద్దలూరు, గుత్తి, ఎమ్మిగనూరు, గుంటూరు, గుణదల, మచిలీపట్నం, మాచర్ల, కడప, మదనపల్లె స్టేషన్లను ఆధునీకరించనున్నారు. వీటితో పాటు రాజమండ్రి, తాడిపత్రి, శ్రీకాళహస్తి, సత్తెనపల్లి, సామర్లకోట, నంద్యాల, మంగళగిరి, మార్కాపురం, మంత్రాలయం, నడికుడి, నర్శరావుపేట, పాకాల, వినుకొండ, రాజంపేట, రాయనపాడు స్టేషన్లు ఆధునీకరించనున్నారు. 


Also read: RGV Satires: పవన్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్న ఆర్జీవీ, ఎక్స్ పోస్ట్‌లు వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook