IPS Transfers: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త జిల్లాల్లో రేపటి నుంచి కొత్త కలెక్టర్లు, కొత్త ఎస్పీలు కొలువుదీరనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 26 జిల్లాలు రేపట్నించి ప్రారంభం కానున్నాయి. కొత్తగా కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తోంది. ఈ నెల 4 నుంచి వివిధ జిల్లాల్లో బాధ్యతలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 51 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. 


విశాఖపట్నం పోలీస్ కమీషనర్‌గా శ్రీకాంత్, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్‌గా మనీష్ కుమార్ సిన్హాలను నియమించింది. శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా జి.ఆర్‌.రాధిక నియమించింది ప్రభుత్వం.  విజయనగరం జిల్లా ఎస్పీగా దీపిక, కృష్ణా జిల్లా ఎస్పీ గా సిద్ధార్థ కౌశల్‌, విజయవాడ కమిషనర్‌గా క్రాంతి రాణా టాటాను కొనసాగించింది. గుంటూరు ఆర్బన్‌ ఎస్పీగా కె.ఆరీఫ్‌ హాఫీజ్‌‌ను అలాగే కొనసాగించింది. ఇక కొత్తగా పార్వతీపురం ఎస్పీగా వాసన విద్య సాగర్‌ నాయుడు, అనకాపల్లి ఎస్పీగా గౌతమి సాలిని నియమించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీగా సతీశ్‌కుమార్, కాకినాడ ఎస్పీగా రవీంద్రనాథ్‌బాబు, కోనసీమ జిల్లా ఎస్పీగా కెఎస్‌ఎస్‌వి సుబ్బారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా ఐశ్వర్య రస్తోగిని నియమించింది ఏపీ ప్రభుత్వం. పశ్చిమగోదావరి జిల్లాగా ఎస్పీగా రవిప్రకాశ్‌, ఏలూరు జిల్లా ఎస్పీగా ఆర్‌ఎన్ అమ్మిరెడ్డిని నియమించింది.


Also read: AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలకు కొత్త కలెక్టర్లు, రేపట్నించి పదవీ బాధ్యతల స్వీకరణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి