Delhi Ganesh Dead: ప్రముఖ తమిళ సీనియర్ నటుడు ఢిల్లీ గణేశ్(80) కన్నుమూశారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో అనారోగ్యం వల్ల ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ఘటన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనతో తమిళ చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఢిల్లీ గణేశ్ వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యలతో గత రాత్రి చెన్నైలోని రామాపురంలో తుదిశ్వాస విడిచారు. ఈయన పలు సినిమాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలక పాత్రలు పోషించాడు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి అగ్ర కథానాయకులతో కూడా ఢిల్లీ గణేశ్ నటించారు. ఈ సీనియర్ నటుడి మృతిపై పలు ప్రములు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
ఇదీ చదవండి: దారుణం.. జర్నలిస్టులను పరిగెత్తించి మరీ కొట్టిన మల్లారెడ్డి ఆస్పత్రి బౌన్సర్లు, వీడియో వైరల్..
1976లో ప్రారంభమైన ఢిల్లీ గణేశ్ సినీ ప్రస్థానం 400 చిత్రాలకు పైగా ఇప్పటి వరకు నటించారు. సినిమా ఇండస్ట్రీ రాక ముందు ఆయన భారత వైమానిక దళంలో కూడా పనిచేశారు. మొదటి సినిమా కే బాలచందర్ దర్శకత్వంలో పట్టిన ప్రవేశం (1977)లో నటించారు. అంతేకాదు ఈయన పలు ప్రముఖ సీరియల్స్ కూడా నటించారు. 1994 కలైమామణి అవార్డును తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అందించింది.
ఇదీ చదవండి: తెలంగాణ ప్రభుత్వం 2025 సెలవుల ప్రకటన.. 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఎప్పుడంటే..?
ఢిల్లీ గణేశ్ నటించిన ప్రముఖ చిత్రాలు నాయకన్ (1987), మైఖల్ మదన కామరాజు (1990), పాసి సినిమాలో అతని నటనకు 1979 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ ఫెయిర్ అవార్డు కూడా దక్కించుకున్నారు. తాజాగా ఆయన కాంచన 3, అభిమన్యుడు, ఇండియన్ 2 సినిమాల్లో కూడా కనిపించారు. అయితే, ఆయన పేరు ఢిల్లీ గణేశ్ అనడానికి కూడా ప్రధాన కారణం ఉంది. ఆయన పనిచేసింది ఢిల్లీలోని వైమానిక దళంలో 1965 ఇండో చైనా యుద్ధ సమయంలో కూడా ఆయన పనిచేశారు. అప్పటి నుంచి ఆయన్ను 'ఢిల్లీ' గణేశ్ అని పిలవడం ప్రారంభమైంది. ఈయన ఫోటోలతో కొన్ని మీమ్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి.మొత్తంగా ఈయన తమిళ, తెలుగు, మళయాలం, కన్నడ సినిమాల్లో నటించారు. కెరీర్ మొదట్లో ఢిల్లీ గణేశ్ దక్షిణ భారత నాటక సభ (DBNS) థియేటర్ గ్రూపు సభ్యుడిగా కూడా ఉన్నారు.ఢిల్లీ గణేశ్ 1944 లో జన్మించారు. ఆయన వైమానిక దళంలో సేవలు కూడా అందించారు. ఆ తర్వాత ఆయనకు నటనపై ఉన్న ఆసక్తితో ఉద్యోగం మానేసి సినిమాల్లో నటించడం ప్రారంభించారు. ఈయన నటుడిగా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పనిచేశారు. ఈ మధ్యకాలంలో కొన్ని వెబ్ సిరీస్‌లో కూడా నటించారు. అయితే, వయో భారతంతో మూడు రోజులుగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈనేపథ్యంలో ఆయన తన స్వగృహంలో నిన్న రాత్రి 11:30 లకు తుది శ్వాస విడిచారు. అయితే, ఢిల్లీ గణేశ్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నిర్వహించనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. మృతదేహాన్ని ఆయన స్వగృహంలోనే సినీ ప్రముఖుల, ప్రజల సందర్శనార్ధం అలాగే ఉంచారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.