Theft in minister Sridhar babu residence in banjara hills: కొన్నిరోజులుగా కాంగ్రెస్ కు చెందని కీలక నేతల ఇళ్లలో చోరీలు జరుగుతుండటం ఆందోళన కల్గించే అంశంగా మారిందని చెప్పుకొవచ్చు. కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత, ఐటీ మంత్రి.. దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇంట్లో దొంగలు పడినట్లు తెలుస్తొంది.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఈ చోరీ జరిగినట్లు తెలుస్తొంది. ఆయన ఇంట్లో నుంచి సెల్ ఫోన్ చోరీ జరిగినట్లు మంత్రి శ్రీధర్ బాబు గుర్తించారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఈ చోరీ విషయం బయటకు రావడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది. మంత్రికే రక్షణ లేకపోతే.. సామాన్యుల పరిస్థితి ఏంటని కూడా మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా.. నెల రోజుల క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. భట్టీ విక్రమార్క ఇంట్లో..ఇంటి వాచ్ మెన్ చోరీకి పాల్పడ్డాడు. వెస్ట్ బెంగాల్ లో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
Read more: CM Revanth Reddy: మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి హావా.. సంచలన ప్రెస్ మీట్.. ఏమన్నారంటే..?
భట్టీ ఇంట్లోని.. రూ.80 వేలు విలువ చేసే వెండి వస్తువులు మాయమైనట్లు గుర్తించారు. ఈ విషయంపై బంజారాహిల్స్ పోలీసులకు కేసు నమోదు చేసి... నిందితులను వెస్ట్ బెంగాల్ పోలీసుల సహాయంతో.. ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో నిందితులును అదుపులోకి తీసుకున్నారు. అయితే.. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ జరగడంతో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.