APSRTC ఎండీగా మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్.. ఉత్తర్వులు జారీ
IPS RP Thakur Appointed As MD Of APSRTC: ఏపీ మాజీ డీజీపీ, సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్పీ ఠాకూర్‌ను ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా నియమించారు. ఈ మేరకు ఠాకూర్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
RP Thakur, MD Of APSRTC: ఏపీ మాజీ డీజీపీ, సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్పీ ఠాకూర్‌ను ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా నియమించారు. ఈ మేరకు ఠాకూర్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, స్టోర్స్ విభాగంలో కమిషనర్‌గా పనిచేస్తున్నారని తెలిసిందే. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ వీసీ ఎండీగా బదిలీ చేస్తున్నట్టు ప్రభుత్వం తమ ఉత్తర్వుల్లో పేర్కొంది.
గత ప్రభుత్వంలో ఆర్పీ ఠాకూర్ డీజీపీగా 10 నెలల పాటు సేవలు అందించారు. వాస్తవానికి గౌతమ్ సవాంగ్‌ను ఏపీ డీజీపీగా నియమిస్తారని ప్రచారం జరగగా.. చివరి నిమిషంలో ఆర్పీ ఠాకూర్‌కు డీజీపీగా 2018లో టీడీపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్పీ ఠాకూర్‌ను బాధ్యతల నుంచి తప్పించి గౌతమ్ సవాంగ్‌ను ఏపీ(Andhra Pradesh) డీజీపీగా నియమించింది.
Also Read: Pongal 2021 Date, Time: మకర సంక్రాంతి తేదీలు, ముహూర్తం.. పండుగ ప్రాముఖ్యత
గత ఏడాది జులై వరకు మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా సేవలు అందించారు. ఆయన బదిలీ అయ్యాక ఐఏఎస్ అధికారి కృష్ణబాబు ఆర్టీసీ వీసీ, ఎండీగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆర్పీ ఠాకూర్ సేవల్ని.. రవాణా, రహదారులు భవనాల శాఖలోవినియోగించుకునేందుకు బదిలీ చేశారు. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఠాకూర్(RP Thakur)ను నియమించినట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: Pongal 2021 సంక్రాంతి ఆ రాష్ట్రాల్లోనూ ప్రత్యేకమే.. అక్కడా సెలబ్రేషన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook