AP Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా..? ముందే ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్‌ భావిస్తున్నారా..? సీఎం జగన్ మదిలో ఏం ఉంది..? ముందస్తు ముచ్చటపై ప్రతిపక్షాలు ఏమంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది..? ప్రస్తుతం ఈ ప్రశ్నలే ఆసక్తి రేపుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికల ముచ్చట వినిపిస్తోంది. సీఎం జగన్‌ పాలనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో వైసీపీ పాలనపై వ్యతిరేకత పెరుగుతోందని..ఈక్రమంలోనే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జగన్‌ ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈసందర్భంగా నేతలకు సూచించారు. 


చంద్రబాబు వ్యాఖ్యలతో ఏపీలో ముందస్తు ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగిన సందర్భాలున్నాయి. ఐతే నవాంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత ముందస్తు ఎన్నికల మాటే లేదు. 2018లో తెలంగాణలో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి అఖండ విజయం సాధించారు. ప్రజా వ్యతిరేకతను ముందే పసిగట్టిన కేసీఆర్..ముందస్తుకు వెళ్లారని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. ఇప్పుడు అదే ఫార్ములాను జగన్‌ పాటిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. అదే జరిగితే ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమంటున్నారు.


చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు  మండిపడుతున్నారు. బాబు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదంటున్నారు. తమను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారని..ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తామంటున్నారు. రాష్ట్రంలో పార్టీని బతికించుకునేందుకు చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామంటున్నారు. మొత్తంగా ఏపీలో రాజకీయాలు రంజుమీద ఉన్నాయి. ప్రతి అంశంపై అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.


Also read: Magic Figure: మేజిక్ ఫిగర్ అంటే ఏంటి, ఐదు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మేజిక్ ఫిగర్ ఎంత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook