Jagan Mind Game with Pawan: ఇప్పటిదాకా ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలను  ఎత్తిచూపుతూ ప్రత్యామ్నాయ పార్టీగా జనసేన ఎదగాలని చూస్తున్న పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు విచిత్ర పరిస్థితి ఎదురైంది. జగన్ ప్రభుత్వం మీద ప్రజాసమస్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న జనసేన అధినేతను జగన్  టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. బాబు దత్త పుత్రుడు అంటూనే తన మైండ్ గేమ్ తో  పవన్ కళ్యాణ్ ను   అవకాశం దొరికినప్పుడల్లా  ఇరుకున పెడుతున్నాడు. ఇంతవరకు బీజేపీ,టీడీపీ, జనసేన కలిసి పనిచేసాయి. కానీ ఇప్పుడు ఈ మూడు పార్టీలు విడిపోయి టీడీపీ సపరేట్... బీజేపీ, జనసేన కలిసి ముందుకు సాగుతున్నాయి.  ఏపీలో చంద్రబాబు ను, టీడీపీని ప్రజలు అంతగా విశ్వసించడం లేదు. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతూ  ప్రజాసమస్యలపై వైసీపీని నిలదీసి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి  పవన్ కళ్యాణ్  శతావిధాలుగా ప్రయత్నిస్తున్నారు. పవర్ స్టార్ గా ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికి పార్టీకి  ఓట్లుగా మలుచుకోలేకపోతున్నాడు పవన్. అందుకని వచ్చే ఎన్నికలవరకు పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టాడు. అయితే జగన్ కూడా పవన్ ను దెబ్బకొట్టాలని మైండ్ గేమ్ మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది.  ఇటీవల భీమ్లా నాయక్ మూవీ విడుదల సందర్భంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరికి తెలిసిందే. కావాలనే   పవన్ కళ్యాణ్ మీద కక్షతోనే ఇదంతా చేశారని జనసైనికులు, పవన్ అభిమానులు జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో సినీఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలు  సీఎం జగన్ తో   చిరంజీవి భేటి కావడంతో సాల్వ్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఏ సమస్య ఉన్న  చిరంజీవి ముందుకు రావడం ముఖ్యమంత్రితో చర్చించడంతో సమస్య పరిష్కారం అవుతున్నాయి.  చిరంజీవి ఇండస్ట్రీలో పెద్ద దిక్కు కాబట్టే సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అంతా అనుకుంటున్నారు. కానీ పవన్ ను దెబ్బకొట్టడానికే ముఖ్యమంత్రి జగన్ చిరంజీవితో సమావేశం అయ్యారని ఇది తమకు ఇబ్బందిగా మారిందని పవన్ అభిమానులు వాపోతున్నారు. మెగా ఫ్యామిలిలో విభేదాలు తెచ్చి పవన్ కళ్యాణ్ ను దెబ్బ కొట్టాలని జగన్ చూస్తున్నాడని జనసేన, పవన్ అభిమానులు అంటున్నారు. తాము ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తే  చిరంజీవి జగన్ ప్రభుత్వాన్ని పోగుడుతున్నాడని ఈ వైఖరితో మెగా అభిమానుల మధ్య మనస్పర్థలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు.  


మెగా ఫ్యామిలిలో నాగబాబు జనసేనలో కొనసాగుతుండగా చిరంజీవి కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు.పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న చిరు సినిమా ఇండస్ట్రీలో సమస్యల  పేరుతో సీఎం జగన్  ను తరుచుగా కలుస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వాన్ని పొగుడుతుండడంతో జనసైనికులకు మింగుడు పడడం లేదు. అలా అని చిరును జనసైనికులు విమర్శించలేరు. ఈ విచిత్ర పరిస్థితితో ఇటు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. పవన్ కళ్యాణ్ ను వైసీపీ నేతలు సీఎం జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటే జగన్ ను  చిరు వరుసగా కలవడం  జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదంతా జగన్ ఆడుతున్న పొలిటికల్ మైండ్ గేమ్ అంటున్నారు. పవన్ కూడా చిరంజీవి విషయంలో ఎటు స్పందించలేక ఇరుకున పడ్డారు.  చిరంజీవి వ్యవహార శైలితో తాము అధికార పార్టీ దృష్టిలో చులకన ఆవుతున్నమని ఇది ఇలానే కొనసాగితే జనసేనకు తీవ్ర నష్టం కలుగుతోందని వాపోతున్నారు జనసైనికులు. 


పవన్ వైసీపీకి ప్రత్యామ్నాయం ఇప్పట్లో కాలేడు కానీ పవన్ కున్న అభిమానుల వల్ల ప్రత్యర్థి అయ్యే ప్రమాదం ఉందని జగన్ గ్రహించే ఈ పొలిటికల్ గేమ్ అడుతున్నాడని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్న పవన్ కు నిజంగా మెగాస్టార్ చిరంజీవి వైఖరి అడ్డొస్తుందా.. ఇది నిజమే అయితే  జగన్ మైండ్ గేమ్ ను పవన్ ఛేదించి పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా మారుస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.


Also Read: IPL 2022 Playoffs Race: ప్లే ఆఫ్స్ చేరిన గుజరాత్.. 3 స్థానాల కోసం 8 జట్ల మధ్య పోటీ! ఛాన్సెస్ ఈ జట్లకే


Also Read: Redmi Offer: Redmi 9A Sport మొబైల్ పై ప్రత్యేక ఆఫర్.. రూ.349 ధరకే అందుబాటులో!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook