జగన్ టీంలో చంద్రబాబు సర్కార్ ఇరుకున పెట్టిన నేతల్లో సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా ముందు వరుసలో ఉంటారు. ఒకానొక దశలో పార్టీలో నెంబర్ టూ అనే స్థాయిలో ఎదిగారు. అలాంటి రోజాకు జగన్ కేబినెట్ లో బెర్త్ ఖాయమని.. హోం శాఖ లాంటి ప్రాధాన్యత ఉన్న శాఖ ఆమెకు కేటాయిస్తారని టాక్ వినిపించింది. ఒకనొక సందర్భంలో స్పీకర్ పదవి ఇస్తారనే వార్త హల్ చల్ చేసింది. తీరా మంత్రి వర్గ జాబితాలో ఆమె పేరు లేదనే వార్త హల్ చల్ చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సామాజిక సమీకరణలే కారణమా ?
మంత్రివర్గం కసరత్తులో భాగంగా సీఎం జగన్ ప్రాంతీయ, సామాజిక సమీకరణలు కచ్చితంగా పాటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఇదే ఫార్మలా పాటిస్తూ కేబినెట్ బెర్తులు కేటాయిస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో విషయానికి వస్తే  రోజా నగరి నుంచి రెండో సారి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. మరోవైపు అదే జిల్లా నుంచి బలమైన రెడ్డి నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి మంత్రి వర్గంలో స్థానం ఇవ్వాల్సి వస్తుండంతో రోజాకు మంత్రివర్గంలో చోటు దక్కలేదని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్త రోజా అభిమానులు ఒకింత నిరాశకు గురవుతున్నారు. 


అందుబాటులో ఉండాలని వర్తమానం
జగన్ మంత్రివర్గ జాబితాలో రోజాకు చోటు లేదని కన్ఫామ్ చేసుకుంటున్న తరుణంలో జగన్ నుంచి రోజాకు వర్తమానం అందినట్లు సమాచారం. శనివారం వెలగపూడిలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమానికి రోజా అందుబాటులో ఉండాలని వర్తమానం పంపినట్లు మరో మీడియాలో కథనాలు వెలుడుతున్నాయి. దీంతో వైఎస్ జగన్ మంత్రి వర్గంలో రోజాకు బెర్త్ అవకాశాలు సజీవంగా ఉన్నట్టు చెబుతున్నారు.


బెర్త్ కన్ఫామ్ అనలేని పరిస్థితి


రోజా విషయంలో కేబినెట్ లో బెర్త ఖాయమని చెప్పలేని పరిస్థితి నెలకొంది. జగన్ నుంచి వర్తమానం వచ్చింద సరే... ఆమెకే కేబినెట్ లో చోటు కల్పిస్తారా ? మరే ఇతర కీలక పదవి ఇస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పరిణామాలు ఎలా ఉన్న చంద్రబాబు సర్కార్ ను ఇరుకున పెట్టిన ఫైర్ బ్రాండ్ మహిళా నేతకు ఇలాంటి పరిస్థితి రావడం... రోజా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారట.