Prabhas:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సినీ లింక్ ఎక్కువే. అన్న ఎన్టీఆర్ సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ తర్వాత కూడా చాలా మంది సినీ తారలు ప్రజా ప్రతినిధులుగా చట్టసభల్లోకి ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి, మురళీ మోహన్, కృష్ణం రాజు , మోహన్ బాబు, కృష్ణ, శారద రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించారు. చిరంజీవి, కృష్ణం రాజులు కేంద్ర మంత్రులుగా కూడా పని చేశారు. చిరంజీవి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో  పని చేయగా.. కృష్ణం రాజుకు వాజ్ పేయి కేబినెట్ లో చోటు దక్కింది. ఇటీవలే కృష్ణం రాజు చనిపోయారు.  వివిధ రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా బీజేపీ జాతీయ నేతలు కృష్ణంరాజును పరామర్శించి వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ ప్యామిలీకి సంబంధించి కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కృష్ణం రాజు ఫ్యామిలీ నుంచి ఒకరు రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్దమైందని తెలుస్తోంది. గోదావరి జిల్లాలో ప్రభాస్ ఫ్యామిలీకి మంచి పట్టుంది. బహుబలి సినిమాలో హీరో ప్రభాస్ క్రేజీ భారీగా పెరిగిపోయింది. ఆల్ ఇండియా లెవల్ లో ప్రభాస్ కు గుర్తింపు వచ్చింది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రభాస్ క్రేజును రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్లమెంటు ఎన్నికల్లోనూ వినియోగించుకోవాలని ఉద్దేశంతో బీజేపీ ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే కృష్ణం రాజు కుటుంబాన్ని బీజేపీలోకి ఆహ్వానించారని తెలుస్తోంది. ప్రభాస్ కుటుంబం బీజేపీలోకి ఎంట్రీ ఇస్తే గోదావరి జిల్లాల్లో తమకు ప్లస్ అవుతుందని అంచనా వేస్తోంది. బీజేపీ ఆహ్వానంపై ప్రభాస్ ఫ్యామిలీ నుంచి సానుకూల సంకేతం వచ్చిందని అంటున్నారు.


ప్రభాస్ సొంత సోదరుడు ప్రబోధ్ ను నర్సాపురం నుంచి ఎంపీగా బరిలోకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్ కు ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.  గతంలో నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా కృష్ణంరాజు పోటీ చేసి గెలిచారు. కేంద్రమంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ను బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తారని సమాచారం. నర్సాపురం లోక్ సభ పరిధిలో  ప్రభాస్ సొంత సామాజికవర్గమైన క్షత్రియుల బలంగా ఉన్నారు. ప్రబోధ్ను బరిలో దింపితే నర్సాపురంలో గెలవడంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ప్రభావం ఉంటుందని కమలనాధులు లెక్కేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు క్షత్రియులు తెలుగు రాష్ట్రాలతో పాటు  ఉత్తరప్రదేశ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్,  పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనూ బలంగానే ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇమేజ్ ను దేశ వ్యాప్తంగా వినియోగించుకోవాలనే యోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారంటున్నారు.


Also Read: Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇమేజ్ తగ్గిందా? టీపీసీసీలో సీనియర్లదే రాజ్యమా?  


Also Read: Nepal: నేపాల్‌లో వరుణుడి ఉగ్రరూపం.. కొండచరియలు విరిగిపడి 17 మంది దుర్మరణం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok