చంద్రబాబు ఎంట్రీతో బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకమయ్యేనా ?
ప్రాంతీయ పార్టీలను కలుపుకొని మహాకూటమి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న విషయం తెలిసిందే. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కొంత వరకు సక్సెక్ అయినప్పటికీ.. కొన్ని పార్టీలు కాంగ్రెస్ తో కలిసి వచ్చేందుకు సిద్ధంగా లేవు అనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.. ఆ లోపాన్ని భర్తీ చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు
వివరాల్లోకి వెళ్లినట్లయితే మహాకూటమి ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి వచ్చేందుకు తృణమూల్ అధినేత్రి మమత, బీఎస్పీ చీఫ్ మాయవతి లాంటి వారు అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. మరోవైపు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ చీఫ్ శదర్ పవార్ తటస్థంగా ఉంటున్నారు. ఫలితంగా జాతీయ స్థాయిలో మహాకూటమికి ఇప్పటి వరకు రూపుం సంతరించుకోలేదు. ఈ నేపథ్యంలో ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు దానికి రూపం ఇచ్చేలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అందుకు తన ఢిల్లీ పర్యటనను ఉపయోగించుకుంటున్నారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం, వివిధ పార్టీలతో ఉన్న సంబంధాలు చంద్రబాబుకు కలిసి వచ్చే అంశాలు. గతంలో పలుమార్లు జాతీయ స్థాయిలో పార్టీలను ఏకం చేసిన ఘన చరిత్ర చంద్రబాబుకు ఉంది. ఈ అంశాలు పరిగణనలోకి తీసుకుని బీజేపీని వ్యతిరేరికంచే అన్ని పార్టీలను చంద్రబాబు ఏకం చేయగలరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు రంగ ప్రవేశంతో బీజేపీ వ్యతిరేక కూటమికి ఒక రూపం సంతరించుకోనుందనే అభిప్రాయాలు రాజకీయా వర్గాల నుంచి వినిపిస్తోంది.
చంద్రబాబు చొరవతో జాతీయ స్థాయిలో మహాకూటమికి రూపం దాల్చితే అది బీజేపీకి ఇబ్బందికరంగా పరగిణించనుంది. అదే జరిగితే బీజేపీకి ప్రత్యాయ్నామ శక్తికి అవతరించుకున్నట్లు అవుతుంది. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు మరోసారి కీ రోల్ చేసే అవకాశముంది.