Central Government Bumper Scheme: కేంద్ర ప్రభుత్వం అందించే ఈ ప్రత్యేకమైన ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం ద్వారా ప్రతి నెల రూ.5 పొందండి. అయితే దీనిని ఎలా అప్లై చేసుకోవాలనో.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Central Government Bumper Scheme: భారత్‌లోని యువతలో చైతన్యం నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నైపుణ్యంతో కూడిన కొత్త కొత్త జాబ్స్‌ను క్రియోట్ చేస్తూ వస్తోంది. అయితే మోదీ ప్రభుత్వం దీనిని దృష్టిలో పట్టుకుని 2024-25 బడ్జెట్‌లో కొత్త పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగానే భారత్‌లో చదువుకున్న ప్రతి యువకుడికి పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్/స్కీమ్‌ను అందిస్తూ వస్తోంది.
అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని స్కీమ్స్‌కి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు వెల్లడించింది. కేంద్రం అందించే ఈ ప్రత్యేకమై ప్రోగ్రామ్స్‌లో భాగంగా ఎంపికైనా వారికి ప్రభుత్వమే నెలకు రూ.5 వేలు అందిస్తోంది.
ఈ ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక యువత దాదాపు ఏడాదికి రూ.60 వేలు పొందవచ్చు. అంతేకాకుండా రానున్న ఐదు సంవత్సరాల్లో ఈ ప్రోగ్రామ్స్‌ను మరింత పెంచేలాగా పలు రకాల చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర వెల్లడించింది.
ఈ ప్రోగ్రామ్‌కు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ..టాప్- 500 కంపెనీల్లో ప్రత్యేకమైన స్టైఫెండ్ కూడా పొందవచ్చు. అయితే ఇప్పటికే ప్రభుత్వం రూ.8 వందల కోట్లతో ప్రత్యకమైన పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది.
అలాగే కేంద్ర డిసెంబర్ నుంచి ఇంటర్న్‌షిఫ్ అవకాశాలను కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.1.25 లక్షల మందికి పైగా ప్రత్యేకమైన ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని అందించనుంది.
ఈ ఇంటర్న్‌షిప్ పొందానికి కేంద్ర ప్రభుత్వం అందించే ప్రత్యేకమైన అధికార pminternship.mca.gov.in. వెబ్‌సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఈ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకునేవారు దాదాపు రూ.5 వందల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.