సి.ఎం రమేష్ కు ఐటీ షాక్ ; ఇది రాజకీయ కక్ష అంటూ ఆరోపణ
హైదరాబాద్: ఇటీవలె రేవంత్ రెడ్డి నివాసంలో తనిఖీలు నిర్వహించిన ఐటీ.. ఇప్పుడు టీడీపీ నేత సి.ఎం రమేష్ ను టార్గెట్ చేసింది. ఆయన ఇళ్లు కార్యాలయాలపై సోదాలు నిర్వహిస్తోంది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం హైదరాబాద్‌లోని సి.ఎం.రమేష్ నివాసంలో 10 మంది అధికారుల బృందం తనిఖీల్లో పాల్గొంది. ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో పాటు కడపలోని ఆయన నివాసంలో ఐటీ అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.ప్రసుత్తం సి. ఎం. రమేష్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఏపీ సీఎంచంద్రబాబు ఇటీవలె తన కేబినెట్ సహచరులు, నేతలకు ఐటీ దాడులకు సంబంధించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఊహించినట్లే ఐటీ దాడులు జరగడం గమనార్హం
అన్యాయంపై ప్రశ్నించినందుకే ఐటీ దాడులు
ఐటీ దాడులపై సి.ఎం రమేష్ స్పందించారు. రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురంచి ప్రశ్నిస్తున్నందుకే తమ ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఐటీ దాడులతో తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం సి.ఎం రమేష్ ఢిల్లీలో ఉన్నారు.