విశాఖ: జగన్ దాడి కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ నిందితుడు శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈ నేపథ్యంలో అతన్ని ఈ రోజు ఎయిర్ పోర్టు పీఎస్ నుంచి కేజీహెచ్ కు తరలించారు. ఈ సంద్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు ట్రీట్మెంట్ వద్దని.. తన అవయవాలు దానం చేయాలని చెప్పినట్లు ఆయనకు చికిత్సనందిస్తున్న వైద్యుడు పేర్కొన్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కాగా పోలీసుల వాహనంలో వెళ్తున్న సమయంలో తనకు ప్రాణహాని ఉందని..ప్రజల కోసమే తాను ఇలా చేశానని ఇందులో ఎవరి ప్రమేయం లేదన్నాడు. ఈ అంశంపై ప్రజలతో మాట్లాడే అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. కాగా అయితే అందుకు పోలీసులు నిరాకరించారు.  ప్రస్తుతం పోలీసు కష్టడీలో ఉన్న నిందితుడు శ్రీనివాస రావుకు  సీట్ అధికారులు విచారణ చేపట్టున్నారు.


జగన్ దాడి  అంశంపై అధికార, ప్రతిపక్షాలు దుమ్మత్తి పోసుకుంటున్నాయి. దీంతో ప్రస్తుతం ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో నిందితుడు శ్రీనివాస్ ఇచ్చిన స్టేట్‌మెంట్ సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో అతను ప్రజలతో ఏం మాట్లాడదల్చుకున్నాడు.. అతనికి పోలీసులు ఎందుకు అడ్డుపడుతున్నారు అనే దానిపై అనేక సందేహాలు నెలకొన్నాయి. మరోవైపు జగన్ కు గాయం మానడానికి కనీసం ఆరు వారుల సమయం పడుతున్నందని వైద్యులు పేర్కొన్నారు