India and Pakistan Matches: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై సస్పెన్స్ వీడింది. పాకిస్థాన్ వేదికగానే ట్రోఫీ జరగనుంది. అయితే భారత్ మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికలపై నిర్వహించనున్నారు. అదేవిధంగా భారత్ వేదికగా నిర్వహించే ఐసీసీ ఈవెంట్లలోనూ పాకిస్థాన్ మ్యాచ్‌లు కూడా తటస్థ వేదికలో జరుగుతాయి. ఇక నుంచి రెండు జట్లు ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చినప్పుడల్లా.. రెండు దేశాల మ్యాచ్‌లు తటస్థ వేదికలలో మాత్రమే జరుగుతాయని ఐసీసీ వెల్లడించింది. ఐసీసీ బోర్డు ఓటింగ్ ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024-2027 ఈవెంట్ సైకిల్‌లో పాక్‌లో జరిగే ఈవెంట్‌లో భారత్ పాల్గొనే అన్ని మ్యాచ్‌లు తటస్థ వేదికల్లో.. ప్రతిగా భారత్ హోస్ట్ చేసే ఈవెంట్‌లో పాకిస్థాన్ పాల్గొన్న అన్ని మ్యాచ్‌లు తటస్థ వేదికలో నిర్వహించనున్నారు.
ఈ ఒప్పందం 2025లో పాకిస్థాన్‌లో జరిగే పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీతో ప్రారంభమవుతుంది. 2025లో భారత్‌లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్, 2026లో భారత్-శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే పురుషుల టీ20 ప్రపంచకప్‌కు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. 2028లో ICC మహిళల టీ20 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను కూడా పాకిస్థాన్ దక్కించుకుంది. ఇక్కడ కూడా భారత్ మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరుగుతాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరుగుతుంది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. అన్ని జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఇక్కడ ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లుతో గ్రూప్ Aలో ఉన్నాయి. భారత్ Vs పాకిస్థాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2024లో న్యూయార్క్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ తలపడింది. బార్బడోస్‌లో వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఆరు పరుగులతో చిత్తు చేసింది. 2023 క్రికెట్ ప్రపంచ కప్‌లోనూ పాక్‌ను భారత్ చిత్తు చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter