వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  సోమవారం హైదరాబాద్లో ఈనాడు గ్రూపు చైర్మన్ చెరుకూరి రామోజీ రావును కలుసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్, పాదయాత్రకు రామోజీ ఆశీస్సులను కోరారు. అంతేకాక, ఇతర విషయాలతోపాటు సిబిఐ కోర్టు నిర్ణయం గురించి 40 నిమిషాల పాటు మాట్లాడారు. జగన్ వెంట భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. ఎడమొహం,పెడమొహంగా ఉన్న వీరిద్దరూ ఈ మధ్య చూస్తుంటే.. రెండు వేర్వేరు గాలులు దిశలను మార్చుకున్నాయా? అన్నట్టుగా ఉంది.  దీనికి కారణం ప్రత్యేకంగా ఈనాడు జగన్ కు ఈ మధ్య కాలంలో గణనీయమైన కవరేజ్ ఇచ్చారు. 


జగన్ కు అక్టోబర్ నెల అచ్చొచ్చినట్టే ఉంది. ఈనెలలో మొదట ఆయన చిన్న జీయర్ స్వామీని కలుసుకొని పాదయాత్రకు ఆశీస్సులు తీసుకున్నారు. ఇప్పుడు రామోజీ రావు ఆశీస్సులు కోరారు. జగన్ పాదయాత్రను నవంబర్ 2 నుంచి తలపెట్టనున్న సంగతి తెలిసిందే!