Jagan Mohan Reddy: జ`గన్` ఆన్ ఫైర్..! వైసీపీ అధినేత స్ట్రాటజీ అదేనా..
Jagan Mohan Reddy: అసెంబ్లీ సమావేశాల్లో జగన్ మోహన్ రెడ్డి తీరు ఎందుకు చర్చనీయాంశంగా మారింది...జగన్ మోహన్ రెడ్డి ఎందుకు అంతలా అగ్రసీవ్ గా కనపడ్డారు. పదే పదే బాబు సర్కార్ పై కేంద్రంకు ఫిర్యాదు చేస్తామని అనడం వెనుక దాగి ఉన్న మర్మమేంటి..? మొన్నటి వరకు అసలు అసెంబ్లీకీ వస్తారా రారా అనుకున్న జగన్ అసెంబ్లీ ఎదుటే ధర్నాకు దిగడం వెనుక ఉన్న రాజకీయమేంటి ? అంతేకాదు ఢిల్లీలో కూడా హల్ చల్ చేసారు.
Jagan Mohan Reddy: 2024 శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడిప్పుడే తేరకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ఫలితాలు వచ్చాక కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న జగన్ ఆ తర్వాత రాజకీయ పరిస్థితులను బట్టి స్పందించడం మొదలు పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో పరిస్థితులు అదుపుతప్పాయని, రాజకీయ కక్షలకు బాబు సర్కార్ పాల్పడుతుందని ఆరోపణలు చేశారు. అంతే కాదు దాడుల్లో మృతి చెందిన, గాయాలైన వారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతే కాదు ఏకంగా ఢిల్లీలో ధర్నాకు దిగారు. అక్కడ ఈయన ధర్నాకు మంచి ఊపే వచ్చింది. జగన్ తీరు చూస్తుంటే ఇక నుంచి రాజకీయాల్లో మరింత యాక్టివ్ కావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. రాజకీయంగా యాక్టివ్ కాకపోతే పార్టీ తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుందని సన్నిహితులు చెప్పినట్లుగా తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఓటమితో తీవ్ర నైరాశ్యంలో ఉన్న వైసీపీ శ్రేణులను తిరిగి యాక్టివేట్ చేయాలంటే నిత్యం జనాల మధ్యన ఉండాలని జగన్ డిసైడ్ అయ్యినట్టు తెలుస్తుంది.
ఏ చిన్న అంశం దొరికినా అధికార పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆందోళనలకు దిగాలని జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగా పరామర్శలు, ఢిల్లీ ధర్నాలు అని జగన్ కోటరీ చెబుతుంది. తాజాగా ఢిల్లీలో జగన్ చేసిన ధర్నాకు విపక్ష ఇండి కూటమికి నేతలు సంఘీభావం ప్రకటించడం విశేషం. అసలే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరుణంలో జగన్ ను చూసిన చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారట. అసలు జగన్ తీరు ఇలా ఉంటుందని తాము అనుకోలేదని సాక్షాత్తు వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే వైసీపీ ఆందోళనకు దిగడం. అందులోను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరును తప్పుబడుతూ సీరియస్ గా రియాక్ట్ కావడంపై వైసీపీలో జోరుగా చర్చ జరుగుతుంది. మా అధినేతను ఎప్పుడూ ఇలా చూడలేదని ..ఇంతలా సీరియస్ గా రియాక్ట్ అవుతారని తాము అనుకోలేదని చెబుతున్నారు.
గతంలో ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో కూడా జగన్ ఇలా వ్యవహరించలేదని కానీ నేడు జగన్ కు ఎన్నికల్లో అత్యంత తక్కువ సీట్లు రావడంతో తన తీరు కూడా మార్చుకున్నట్టు తెలుస్తుంది.జగన్ లోని ఈ మార్పు ఒకింత సర్ ప్రైజ్ చేసిందని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. జగన్ మోహన్ రెడ్డిలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అని తాము అనుకోలేదని జగన్ ఇలా వ్యవహరించడం పార్టీకీ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని వారు చెప్పుకొస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఓటమితో నిరాశలో ఉన్న క్యాడర్ కు జగన్ తీరు బూస్టింగ్ లా ఉందని వారు చెబుతున్నారు. జగన్ చాలా కాన్పిడెంట్ గా కనపడ్డారని జగన్ లో ఏదో కొత్త ఉత్సాహంతో కనపడుతున్నారని దీనికి కారణమేంటో అని వైసీపీ వర్గాలు ఆరా తీయడం మొదలుపెట్టారు. మరోవైపు ఏదైతే ఏముంది జగన్ మోహన్ రెడ్డి మీద ప్రజలకు ఇంకా సానుకూల వాతావరణం ఉందని..ఆయన నిత్యం ప్రజల మధ్య ఉండి సర్కార్ తప్పులను ఎండగడితే పార్టీకీ మరింత కలిసి వస్తుందని వారు అంచనా వేస్తున్నారు.
మరోవైపు జగన్ మాటిమాటికి ఢిల్లీకీ ఫిర్యాదు చేస్తామని అనడం వెనుక ఏదైనా మర్మం ఉందా అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుందట. అసలు ఢిల్లీ ఢిల్లీ అని ఎందుకు జగన్ కలవరిస్తున్నట్లు, అక్కడ ఢిల్లీ పెద్దలతో జగన్ ఏదైనా రాయబారం నడుపుతున్నారా . ఇప్పటికే మోడీతో జగన్ కు సత్సంబంధాలు ఉన్నాయనేది వైసీపీ వర్గాల అంచనా. గత పదేళ్లలో మోడీతో కానీ కేంద్రంతో కానీ ఏనాడు జగన్ విభేధించలేదు. అంతే కాదు ఎన్డీయో ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు వైసీపీ బేషరుతుగా రెండు సభల్లో తెలిపింది. ఇక మూడో సారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయో కు పరోక్షంగా జగన్ మద్దతు తెలుపుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇటీవల జరిగిన స్పీకర్ ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోరుతూ బీజేపీ లేఖ రాయడం దీనికి నిదర్శనంగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తమకు బీజేపీతో కానీ మోడీతో కానీ ఎలాంటి సమస్యలేదు. మోదీతో ఇప్పటికి తమ అధినేత జగన్ కు మంచి సంబంధాలు ఉన్నాయని పరిస్థితులకు అనుకూలంగా తాము వ్యవహరిస్తామని వైసీపీ చెబుతుంది.
దీనిలో భాగంగానే నిన్న జరిగిన ధర్నాతో ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులను దేశానికి తెలపడంతో పాటు వీలును బట్టి రాష్ట్రపతి, ప్రధాని మోదీతో జగన్ భేటీ కావాలనుకుంటున్నారు. మోదీతో భేటీలో రాష్ట్ర పరిస్థితులతో పాటు రాజకీయ వ్యవహారాలను చర్చించే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది. అంతే కాదు అసలు జగన్ తో బీజేపీ ఎలా వ్యవహరించాలనుకుంటుందో తెలసుకునే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారట.ఒకవేళ చంద్రబాబు రాజకీయంగా తనను ఇబ్బంది పెడితే నరేంద్ర మోడీని సహాయం కోరవచ్చని జగన్ అనకుంటున్నారట. అందుకే వీలైనంత వరకు మోడీతో జగన్ మంచి సంబంధాలు కోరుకుంటున్నారట. వీలు చిక్కినప్పుడల్లా మోడీనీ కలవడమే ఉత్తమం అని మోదీతో ఎలాంటి గ్యాప్ రాకుండా జగన్ జాగ్రత్తపడుతున్నారట. మరోవైపు టీడీపీ, బీజేపీలోని ఒక వర్గం కూడా జగన్ కు ఢిల్లీ పెద్దల అపాయింట్ మెంట్ రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ జరుగుతుంది. జగన్ రాజకీయంగా పూర్తిగా ఒంటరయ్యాడని , గతంలో జగన్ తో ఉన్నవారంతా ఇప్పుడు దూరం అయ్యారని అలాంటి జగన్ ను ఇంకా దెబ్బతీయాలంటే అసలు కేంద్రంలో ఎవరి అపాయింట్ మెంట్ దక్కకుండా చూడాలని అనకుంటుందట. జగన్ ను సొంత కుటుంబ సభ్యులే పట్టించుకోవడం లేదు. మీకు ఎందుకు ఈ గొడవ అని ఢిల్లీ పెద్దల చెవుల్లో ఊదుతున్నారట.కానీ అనూహ్యంగా జగన్ కు ఢిల్లీలో విపక్ష కూటమి సభ్యుల మద్దతు దొరకడం గమనార్హం.
మరోవైపు వైసీపీ శ్రేణులు మాత్రం జగన్ అందరూ అనుకున్నట్లు సాధారణ రాజకీయ నాయకుడు కాదని తను అనుకున్నది సాధించే రకం అని చెబుతున్నారు. జగన్ అనుకున్నది సాధించేందుకు ఎన్ని కష్టాలైన పడడానికి సిద్దపడుతారు తప్పా కాడి ఎత్తిపడేయరు అని వైసీపీ నేతలు చాలా కాన్పిఢెన్స్ గా చెబుతున్నారు. గతంలో ఇంత కన్నా దారుణ పరిస్థితుల్లో కూడా జగన్ భయపడలేదని. అందునా జీరో నుంచి మొదలు పెట్టిన జగన్ కు మళ్లీ అధికారంలోకి రావడం పెద్ద పని కాదని కొద్ది రోజుల్లో అన్ని సర్ధుకుంటాయని తిరిగి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జగన్ సన్నిహితులు చెబుతున్నారు. కాకపోతే ఇక నుంచి జగన్ వీలైనంత వరకూ జనం మధ్యనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారని దాని కోసం ఏం చేయాలన్నదానిపై పార్టీలో చర్చ జరుగుతుందట. దీనికి సంబంధించిన వ్యూహాలు తాడేపల్లిలో సిద్దమవుతున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. దీని కొనసాగింపులో భాగంగానే ఢిల్లీలో ధర్నా దిగినట్టు సమాచారం.
మొత్తానికి జగన్ ఢిల్లీ ధర్నాలో ఏం చెప్పబోతున్నారు. ఇక నుంచి వైసీపీ ఎలాంటి కార్యక్రమాలు ప్లాన్ చేయాలనుకుంటుంది. బీజేపీతో జగన్ ఎలాంటి రిలేషన్ మెయిన్ టేన్ చేస్తారు, జగన్ అస్సలు బీజేపీ పెద్దలు పట్టించుకుంటారా లేరా అనేది మరి కొద్ది రోజుల్లోనే తేలనుంది. ఇక నుంచి ఢిల్లీ వేదికగా ఏపీ రాజకీయాలు రక్తికట్టడం మాత్రం ఖయంగా కనిపిస్తోంది.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook