Jagan on Ramya Vedict: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యలో దోషి శశికృష్ణకు ఉరిశిక్ష వేస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు ఇచ్చింది. రమ్యను దారుణంగా హతమార్చిన శశికృష్ణకు ఉరిశిక్ష పడటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై సామాజిక మాధ్యమాల వేదికగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. విద్యార్థిని రమ్య హత్య కేసులో ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చారిత్మాత్మకం అంటూ ట్వీట్ చేశారు. ఈ తీర్పును స్వాగతిస్తున్నానన్నారు. హత్య కేసులో వేగంగా దర్యాప్తు చేసి.. దోషికి శిక్ష పడేలా చేసినందుకు పోలీస్ శాఖను అభినందించారు. జగన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 




తీర్పుపై రోజా స్పందన:


రమ్య హత్య కేసు విచారణను 8 నెలల్లోనే పూర్తి చేసి తుది తీర్పు ఇవ్వడం హర్షనీయం అన్నారు మంత్రి రోజా. దిశ చట్టం స్ఫూర్తితో త్వరితగతిన విచారణ పూర్తి చేసి శిక్ష పడేలా చేశామన్నారు. కేంద్రం దిశ చట్టం అమలు చేస్తే 21 రోజుల్లోనే నిందితుడిని ఉరితీయొచ్చన్నారు. ఆడపిల్లలపై ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని రాజకీయం చేసేందుకు తెలుగు దేశం పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.


టీడీపీ హయాంలో మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించలేదన్నారు. తాము తీసుకొచ్చినట్లు టీడీపీ హయాంలో దిశ చట్టాన్ని తీసుకొచ్చారా ? దిశ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశారా ? దిశ యాప్ తో రక్షణ కల్పించారా అని ప్రశ్నించారు. ఇవేవీ చేయకుండా రాజకీయం చేస్తున్న టీడీపీని ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.


Also Read:Ramya Murder Case Verdict: బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో సంచలన తీర్పు.. దోషికి ఉరి శిక్ష!


Also Read: Bjp Slogans at Minster Prasanth Reddy: మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎదుట జైశ్రీరాం నినాదాలు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook