Jagan Anna Vidya Deevena Scheme: జగనన్న విద్యా దీవెన, ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ చెల్లింపులపై జగన్ సర్కారు కీలక ప్రకటన చేసింది. 2022 ఏడాదిలో ఏప్రిల్‌ – జూన్‌ త్రైమాసికానికిగాను 11.02 లక్షల మంది విద్యార్ధులకు రూ. 694 కోట్ల నిధులను సీఎం వైఎస్‌ జగన్‌ రేపు గురువారం నేరుగా విద్యార్ధుల తల్లుల బ్యాంకు ఎకౌంట్లలో జమ చేయనున్నట్టు ఏపీ సర్కారు ప్రకటించింది. ఫీజు రీఇంబర్స్‌మెంట్‌కి సంబంధించి తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన కారణంగా 2017 నుండి విడుదల కానీ రూ. 1,778 కోట్ల బకాయిలను కూడా విడుదల చేశామని.. అవన్నీ కలుపుకుని ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 11,715 కోట్లకు చేరుతుందని ఏపీ సర్కారు వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలను చదివించుకునేందుకు వీలుగా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల లబ్ధిదారుల అర్హతలకు ఎలాంటి షరతులు, పరిమితులు విధించలేదని ఏపీ సర్కారు స్పష్టంచేసింది. అందరికీ విద్యను అందించాలనే లక్ష్యంతోనే పరిమితులు పెట్టలేదని సర్కారు అభిప్రాయపడింది. పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న గొప్ప లక్ష్యంతో జగన్ సర్కారు పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ విద్యను అభ్యసించే పేద విద్యార్ధుల ఫీజును క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ఫీజు రీఇంబర్స్‌మెంట్ మొత్తాన్ని జమ చేస్తున్నట్టు సర్కారు తమ ప్రకటనలో పేర్కొంది.


పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చులకు ఇబ్బందులపాలు కాకుండా ప్రతీ సంవత్సరం 2 వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు రూ. 15 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని.. అలాగే డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదువుకునే విద్యార్థిని, విద్యార్థులకు రూ. 20 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తున్నామని సర్కారు చెబుతోంది. కాలేజీల్లో నాణ్యమైన విద్యను అందించేలా, పారదర్శకత, జవాబుదారీతనం పెరిగేలా విద్యార్థుల తల్లులకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ, తల్లుల సాధికారతకు పట్టం కట్టిన ఘనతే తమ ప్రభుత్వానికే దక్కుతుందని జగన్ సర్కారు (AP Govt) చెబుతోంది.


Also Read : Gorantla Madhav Live Updates: వీడిన ఉత్కంఠ.. గోరంట్ల వీడియో ఫేక్ అన్న ఎస్పీ.. 'నేను కడిగిన ముత్యం: 'గోరంట్ల మాధవ్


Also Read : AP ECET 2022 Results: ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P2DgvH


Apple Link - https://apple.co/3df6gDq


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook