Jagananna Vidya Deevena Scheme: గుడ్ న్యూస్.. నేడే ఖాతాల్లోకి `జగనన్న విద్యా దీవెన`
Jagananna Vidya Deevena Scheme: ఉన్నత విద్యలో తమ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని ప్రకటించిన ఏపీ సర్కారు.. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు కింద రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేలా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి సౌకర్యాలను అందిస్తున్నట్టు పేర్కొంది.
Jagananna Vidya Deevena Scheme Money: ఏప్రిల్ – జూన్ 2023 త్రైమాసికానికి 9,32,235 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ. 680.44 కోట్లను నేడు సోమవారం చిత్తూరు జిల్లా, నగరిలో ఏపీ సీఎం వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి 8,44,336 మంది తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో.. ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు ఇచ్చేలా వారి తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న పథకమే ఈ 'జగనన్న వసతి దీవెన' పథకం.
ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం చొప్పున కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతుంటే అంత మందికీ నేరుగా వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు విడతల్లో డబ్బులు జమ చేస్తోన్న ఏపీ సర్కారు నేడు కూడా జగనన్న విద్యా దీవెన పథకం కింద డబ్బులు జమ చేయనుంది.
ఉన్నత విద్యలో తమ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని ప్రకటించిన ఏపీ సర్కారు.. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు కింద రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేలా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి సౌకర్యాలను అందిస్తున్నట్టు పేర్కొంది. జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్ తో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు కరిక్యులమ్ లో మార్పులు చేసి నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు.. విద్యార్థులలో నైపుణ్యాలను పెంచి వారు వెంటనే ఉపాధి పొందేలా 30 శాతం నైపుణ్యాభివృద్ధి కోర్సులు.. కరిక్యులమ్ లో భాగంగా ఆన్లైన్ వర్టికల్స్ అందిస్తున్నామని.. అందువల్ల విద్యార్థులు తాము చదువుతున్న కోర్సులతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు ఆన్‌లైన్‌లో నేర్చుకునే వెసులుబాటు ఉంటుంది అని ఏపీ సర్కారు తమ తాజా ప్రకటనలో పేర్కొంది.
కరిక్యులమ్ లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్‌షిప్ పెట్టడం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం జరుగుతోందన్నారు. ఒకే విద్యా సంవత్సరంలో 3 లక్షల మంది విద్యార్థులు సర్టిఫికేషన్స్ సాధించిన ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమే అని చెబుతూ... " Microsoft లో 1.27 లక్షల మంది, Salesforce లో 33,000, AWS లో 24,000, Nasscomలో 20,000. Palo Alto లో 10,000, Data Analytics లో 15,442, Cyber Security లో 12,709, Process Miningలో 10 వేల మందికి సర్టిఫికేషన్స్ ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలు " కల్పిస్తున్నట్టు ఏపీ సర్కారు వెల్లడించింది.
ఇది కూడా చదవండి : Payakaraopeta Politics: వంగలపూడి అనితకు ఆ ఒక్క ఛాన్స్ వచ్చేనా ?
ఇంటర్ పాసై పై చదువులకు దూరమైన విద్యార్థుల సంఖ్య 2018-19 లో 81.813 కాగా తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కారణంగా ఈ సంఖ్య గణనీయంగా తగ్గి 2022-23 నాటికి కేవలం 22,387 కు చేరింది. 2022-23 నాటికి ఇంటర్ పాసై పై చదువులకు పోలేని విద్యార్థుల జాతీయ సగటు 27% కాగా, మన రాష్ట్రంలో ఇది కేవలం 6.62 % మాత్రమే అని ఏపీ సర్కారు అభిప్రాయపడింది.
ఇది కూడా చదవండి : New TTD Board Members: చర్చనియాంశంగా మారిన టిటిడి బోర్డు సభ్యుల ఎంపిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి