YSR Kapu Nestham: మహిళలకు గుడ్‌న్యూస్.. ఈ నెల 22న అకౌంట్‌లోకి డబ్బులు..!

YSR Kapu Nestham Scheme Eligibility List: వైఎస్ఆర్ కాపు నేస్తం కింద నాలుగో విడత డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో ఈ నెల 22న జమ చేయనున్నారు సీఎం జగన్. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున బటన్ నొక్కి నేరుగా అకౌంట్‌లోకి వేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 18, 2023, 07:52 AM IST
YSR Kapu Nestham: మహిళలకు గుడ్‌న్యూస్.. ఈ నెల 22న అకౌంట్‌లోకి డబ్బులు..!

YSR Kapu Nestham Scheme Eligibility List: జగన్ సర్కారు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. కాపు మహిళలకు ఈ నెల 22న కాపు నేస్తం పథకం నిధులను విడుదల చేయనున్నట్లు తెలపింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జరిగే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులను జమ చేయనున్నారు. కాపు నేస్తం పథకం కింద ప్రభుత్వం నాలుగో విడత డబ్బులను లబ్ధిదారులకు అందజేయనుంది. సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్ మాధవీలత ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించారు.  ముఖ్యమంత్రి రూట్‌ మ్యాప్, సెయింట్‌ ఆంబ్రోస్‌ హైస్కూల్‌లో పబ్లిక్ మీటింగ్, నెహ్రూబొమ్మ సెంటరు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో హెలిప్యాడ్‌కు స్థలాలను పరిశీలించారు. భదత్రా ఏర్పాట్లపై పోలీస్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళకు కాపు నేస్తం అందిస్తోంది ప్రభుత్వం. 45 నుంచి 60 ఏళ్ల లోపున్న మహిళలను అర్హులుగా ప్రకటించింది.  కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలలోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలలోపు ఉండాలి. అదేవిధంగా కుటుంబానికి 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాట మెట్ట.. రెండు కలిపి 10 ఎకరాలకు మించి ఉండకూడదని ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఇక పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి 1000 చదరపు అడుగులు.. అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారు మాత్రమే అర్హులని తెలిపింది. కుటుంబానికి కారు వంటి నాలుగు చక్రాల వాహనాలు ఉంటే అనర్హలని తెలిపింది. అయితే  ఆటో, టాటా ఏస్‌, ట్రాక్టర్‌ వంటి జీవోనపాధికి ఉపయోగించే వాహనాలు ఉన్న వాళ్లకు మినహాయింపునిచ్చింది. ట్యాక్స్ చెల్లించేవారు కూడా కాపు నేస్తానికి అనర్హులు. 

ఈ పథకం కింద ఏటా రూ.15వేల చొప్పున నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే అమౌంట్ జమ చేస్తోంది. ఐదేళ్లలో రూ.75 వేల ఆర్థిక సాయం అందించాలనేది ప్రభుత్వం లక్ష్యం. ఇప్పటికే మూడు దఫాలుగా రూ.15 వేల చొప్పున జమ చేసింది. ఈ నెల 22న నాలుగో విడత డబ్బులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవ్వగానే.. రిజస్టర్ మొబైల్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. అర్హత ఉండి జాబితాలో పేరు లేకుంటే.. నేరుగా సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా కాపు నేస్తం సాయం అందుతుంది.

Also Read: Ind Vs IRE 1st T20: నేడే బుమ్రా రీఎంట్రీ.. ఐర్లాండ్‌తో తొలి టీ20.. కుర్రాళ్లు కుమ్మేస్తారా..?  

Also Read: Cement Block on Railway Track: తప్పిన ఘోర రైలు ప్రమాదం... ఒడిషా తరహా రైలు ప్రమాదానికి భారీ కుట్ర ?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News