పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జగన్ పాదయాత్రకు ఆటంకం ఏర్పడింది. అనుకున్న రూట్ ప్రకారం రాజమండ్రి గోదావరి బ్రిడ్జిపై నుంచి పాదయాత్ర సాగాలి. వంతెన బలహీనంగా ఉందని కారణం చూపుతూ బ్రిడ్జిపై  పాదయాత్రను నిరాకరించారు. పాదయాత్రకు మరో మార్గం చూసుకోవాలని సూచిస్తూ రాజమండ్రి డీఎస్పీ వైసీపీ నేతలకు ఓ లేఖ రాశారు. ఒకే సారి ఎక్కువ మంది రావడం మంచిది కాదని సూచించారు. వంతెన పరిస్థితి సరిగా లేనందునే పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. పాదయాత్రకు మరో మార్గం చూసుకోవాలని సలహా ఇచ్చారు. కాగా ఈ రోజు జగన్ నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు.