జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురువారం హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో కంటి సర్జరీ చేయించుకున్నారు. గత రెండు నెలలుగా ఆయన కంటి ఇన్ఫెక్షన్‌‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అందుకే పలు కార్యక్రమాలలో నల్ల కళ్లద్దాలతోనే పాల్గొన్నారు. ఇటీవలే తన కంటి సమస్య నిమిత్తం ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా.. వారి సలహా మేరకు కంటి సర్జరీ చేయించుకొనేందుకు ఒప్పుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో రంగస్థలం సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నల్ల కళ్లద్దాలను ధరించారు. అప్పుడు ఆ కళ్లద్దాల వెనుక ఉన్న కారణాలను కూడా ఫ్యాన్స్‌కి తెలిపారు. తాను ఫ్యాషన్ కోసం ఆ కళ్లద్దాలు ఏమీ పెట్టుకోలేదని.. చిన్న కంటి సమస్య ఉండడం వల్లే పెట్టుకున్నానని అప్పుడు ఆయన తెలిపారు. రంజాన్ సమయంలో కూడా ఆయన తన కంటి సమస్య నిమిత్తం డాక్టర్లను సంప్రదించారని వార్తలు వచ్చాయి.


ఈ క్రమంలో ఆయన ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చారు. తర్వాత ఈ ఆపరేషన్ నిమిత్తమే బ్రేక్ తీసుకొని హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో సర్జరీ నిమిత్తం చేరారు. సర్జరీ పూర్తి కాగానే..  రెండు రోజులు విశ్రాంతి తీసుకొని.. మళ్లీ తన పార్టీ కార్యక్రమాలకు హాజరవుతారు. జులై 17వ తేదిన జరగబోయే తూర్పు గోదావరి టూర్‌కి పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.