Pawan Kalyan: వారాహి కలర్ వివాదంపై పవన్ కళ్యాణ్ పంచ్.. జనసేనానిని ఇంట్రెస్టింగ్ ట్వీట్
Janasena Varahi Vehicle Colour Controversy: జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనం రంగుపై వస్తున్న వైసీపీ చేస్తున్న వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. షర్ట్ ఫొటో షేర్ చేస్తూ.. వైసీపీ కనీసం తనను ఈ షర్ట్ అయినా వేసుకోవడానికి అనుమతి ఇస్తుందా..? అంటూ కౌంటర్ ఇచ్చారు.
Janasena Varahi Vehicle Colour Controversy: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం రథం వారాహి వాహనంపై ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఈ వాహనం రంగును వైసీపీ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. ఆలీవ్ గ్రీన్ కలర్ సొంత వాహనాలకు వేయకూడదని చట్టం చెబుతోందని వైసీపీ అంటుండగా.. జనసేన పార్టీ కూడా అదేస్థాయిలో కౌంటర్ ఇస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రజల ఆస్తులకు పార్టీ రంగులు వేసే వారి నుంచి అంతకంటే ఎక్కువ ఏం ఆశించగలమంటూ చురుకలు అంటిస్తోంది.
ఈ విషయంపై పవన్ కళ్యాణ్ కూడా వ్యంగ్యంగా పంచ్ ఇచ్చారు. షర్ట్ ఫొటోను షేర్ చేస్తూ.. 'వైసీపీ కనీసం నన్ను ఈ షర్ట్ అయినా వేసుకోవడానికి అనుమతి ఇస్తుందా' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. 'మొదట మీరు నా సినిమాలను ఆపేశారు. విశాఖపట్నంలో నన్ను వాహనం, హోటల్ గది నుంచి బయటకు రానివ్వలేదు. నన్ను నగరం వదిలి వెళ్లమని బలవంతం చేశారు. మంగళగిరిలో మీరు నా కారుని బయటకు వెళ్లనివ్వలేదు. తర్వాత నన్ను నడవనివ్వలేదు. ఇప్పుడు వాహనం రంగు మీకు సమస్యగా మారింది. సరే.. నేను ఊపిరి తీసుకోవడం ఆపేయాలా..?? తరువాత..' అంటూ ఆయన ట్వీట్ చేశారు.
జనసేనాని ఎన్నికల పర్యటనటకు వారాహి వాహనాన్ని దగ్గర ఉండి సిద్ధం చేయించారు. ఇటీవల వాహనాన్ని హైదరాబాద్‌లో ఈ వాహనం ట్రయల్ రన్ కూడా పూర్తయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు.. ఫొటోలను వైరల్ చేశారు. అయితే వారాహి కలర్‌పై విమర్శలు వచ్చాయి.
మోటార్ వెహికల్ యాక్ట్ 1989 చాప్టర్ 121 ప్రకారం ఇండియన్ డిఫెన్స్ విభాగం వారు తప్ప.. ఇతర ప్రైవేట్ వ్యక్తులు తమ వాహనాలకు ఆలీవ్ గ్రీన్ కలర్ ఉపయోగించకూడదని అంటున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నారు.
ఈ విమర్శలకు దీటుగా కౌంటర్ ఇస్తున్నారు జనసైనికులు. ఆలీవ్ గ్రీన్‌లో చాలా రంగులు ఉంటాయంటున్నారు. అందులో కొన్నింటికి పర్మిషన్ ఉంటుందని.. తమ నాయకుడు నిబంధనలకు లోబడి, తగిన జాగ్రత్తలు తీసుకున్న తరువాతే ఏ పని అయినా చేస్తారని గుర్తుచేస్తున్నారు. కొన్ని బుల్లెట్ బైక్‌లకు కూడా ఈ కలర్ ఉందని.. వారాహి వాహనం రంగుకు వచ్చిన ఇబ్బందేమి లేదని చెబుతున్నారు.
Also Read: Mandous Cyclone: దూసుకువస్తున్న మాండస్ తుఫాన్.. ఈ జిల్లాలకు హెచ్చరిక
Also Read: Himachal Pradesh CM: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు.. రేసులో ఉన్నది వీళ్లే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook