Kadapa Yogi Vemana University: కడప జిల్లా యోగి వేమన యూనివర్సిటీలో వేమన విగ్రహాన్ని తొలగించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. వేమన పద్యం రూపంలోనే ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

''విద్యలేనివాడు విద్వాంసుచేరువ
నుండగానే పండితుండుగాడు
కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!


తాత్పర్యం: విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా అని అర్థం.


ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు
పరగ మూలికలకు పనికివచ్చు.
నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు?
విశ్వదాభిరామ! వినుర వేమ!


తాత్పర్యం: విష వృక్షమైన ముష్టి, అమిత చేదుగా ఉండే వేపాకు కూడా ఔషధ రూపంగానైనా లోకానికి ఉపయోగపడతాయి.దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగ-పడడు, అంతేకాదు హాని కూడా చేస్తాడు..'' అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. 


 



ప్రజాకవి యోగి వేమన పేరు మీద 2006లో కడప జిల్లాలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. వేమన గొప్పతనాన్ని చాటేలా ప్రధాన పరిపాలన భవనం ముందు ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఆ విగ్రహాన్ని అధికారులు తొలగించి గేటు పక్కన పెట్టారు. వేమన విగ్రహం స్థానంలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేశారు. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముళ్లును ముళ్లుతోనే తీయనట్లు.. యోగి వేమన యూనివర్సిటీ విగ్రహం తొలగించిన ప్రభుత్వంపై ఆయన పద్యంతోనే కౌంటర్ ఇచ్చారు.


Also Read: IND vs ENG: ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌.. భారత జట్టులో రెండు కీలక మార్పులు! స్టార్ ప్లేయర్ ఖేల్ ఖతం   


Also Read: Samantha Tension: మరో క్యాంపులో మంటలు పెట్టేసిన సమంత.. ఆ ప్రకటన వెనుక పరమార్ధం అదేనా


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook