Pawan Kalyan video: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ప్రజలను ఉత్తేజపరిచేలా.. ఇంకా ఎవరికి ఊడిగం చేస్తామన్నారు. ఆ వీడియో పవన్ కళ్యాణ్ మాటలు ఇలా.. "మనల్ని పరిపాలించిన రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం మొత్తం దేశానికి భారతీయ సంతతికి చెందిన రుషి సునాక్ ప్రధాన మంత్రి అవగలిగే పరిస్థితులు ఉన్నప్పుడు..  ఇక్కడ ఇంకా ఎందుకు ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం ఉన్న వ్యక్తులు మిగతా వాళ్లను ఎందుకు రానివ్వరు..? ఎంత కాలం రానివ్వకుండా ఉంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతదేశం స్వతంత్రం సంపాదించుకుని మనం చేసిన అద్భుతం ఏంటంటే.. పంచాయితీ ఎన్నికల్లో అణగారిన వర్గానికి చెందిన ఒకరు కూర్చొని స్వేచ్ఛగా నామినేషన్ వేద్దాం ఓట్లు వచ్చినా రాకున్నా అనుకొనే పరిస్థితి లేదు. దీని గురించి ఏమనాలి..? బ్రిటీష్ వాడు వదిలి వెళ్లిపోయినా ఇంకా ఊడిగం  ఎవరికి చేస్తాం. నామినేషన్ వేసే అర్హత కూడా నీకు లేదని భయపెట్టేస్తుంటే దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి. ఫ్యూడలిస్టిక్ కోటల్ని బద్దలు కొట్టక తప్పదు.. ఏ రోజు అని ఎదురుచూస్తున్నా.." అంటూ పవన్ కళ్యాణ్‌ చెప్పుకొచ్చారు.


 



మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ప్రభుత్వం ఇళ్లు, గోడలు కూల్చివేసింది. అక్కడ బాధితులకు అండగా నిలిచేందుకు లక్ష రూపాయలు వంతున పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. నైతిక మద్దతుతోపాటు ఆర్థికంగా కూడా అండగా నిలబడాలని ఆయన నిర్ణయించారు. ఈ మొత్తాన్ని త్వరలోనే బాధితులకు పవన్ కళ్యాణ్ అందజేయనున్నారు. 


జనసేన ఆవిర్భావ సభకు ఇప్పట గ్రామస్తులు స్థలం ఇవ్వడంతోనే ఇళ్లు, గోడలు కూల్చివేత కారణమని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. ఇప్పటం గ్రామానికి చేరుకుని అక్కడ కూల్చిన ఇళ్లను పరిశీలించారు. ఇప్పటంలో ఇళ్లు కూలిస్తే.. ఇడుపులపాయలో హైవే వేస్తామంటూ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. రోడ్డు వెడల్పు అంటూ మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, నెహ్రూ గారి విగ్రహాలు, ఆఖరికి శివుడికి కాపలాగా ఉండే నంది విగ్రహాన్ని కూడా కూల్చేశారని.. మరి వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చకుండా  ఎందుకు వదిలేశారని ఆయన నిలదీశారు. దీంతో ఇప్పటం గ్రామంలో ‌వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించింది. 


Also Read: అప్పటి నుంచి ఏమీ లేదు.. ఎవర్ని ఎక్కడ పెట్టాలో ఎన్టీఆర్ కు తెలుసంటున్న డైరెక్టర్!


Also Read: Amazon Smart tv offers: మీ ఇంటిని హోమ్ థియేటర్‌గా మార్చే స్మార్ట్‌టీవీ కేవలం 9 వేలే


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook