Janasena 2nd List: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. నోటిఫికేషన్ ఇంకా వెలువడకపోయినా ఏప్రిల్ రెండో వారంలో ఎన్నికలు ఖాయంగా కన్పిస్తున్నాయి. ఈ క్రమంగా వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇప్పటికే చాలావరకూ అభ్యర్ధుల్ని ప్రకటించాయి. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా తాను ఎక్కడ్నించి పోటీ చేసేది చెప్పలేకపోతున్నారు. ఇవాళ 9 మంది అభ్యర్ధులతో రెండో జాబితాను ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక బీజేపీ 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన పార్టీ 2 లోక్‌సభ, 21 అసెంబ్లీ స్థానాలకు పరిమితం కానుంది. ఈ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ తొలి జాబితాలో చంద్రబాబు, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ సహా 94 మంది అభ్యర్ధులతో తొలి జాబితా ప్రకటించగా, జనసేన మాత్రం 5మందితో తొలి జాబితా ప్రకటించింది. ఇవాళ మరో 9 మంది అభ్యర్ధులతో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ రెండు జాబితాల్లో కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడ్నించి పోటీ చేసేది స్పష్టత లేకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. 


జనసేన రెండో జాబితాలో విశాఖపట్నం దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, పెందుర్తి నుంచి పంచకర్త రమేశ్, ఎలమంచిలి నుంచి విజయకుమార్, ఉంగుటూరు నుంచి ధర్మరాజు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు, రాజోలు నుంచి దేవ వరప్రసాద్, తిరుపతి నుంచి అరణి శ్రీనివాసులు ఖరారయ్యారు.  జనసేన ప్రకటించిన తొలి జాబితాలో నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ ఉన్నారు. 


ఇప్పటి వరకూ జనసేన రెండు జాబితాల్లో 14 మందిని ప్రకటించింది. ఇంకా 7 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్ధుల్ని ప్రకటించాల్సి ఉంటుంది. మరి జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడ్నించి పోటీ చేస్తారనేది ఇంకా స్పష్టం చేయలేకపోయారు. కాకినాడ లోక్‌సభ, పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేయవచ్చనే వార్తలు వస్తున్నాయి. 


Also read: Supreme Court: ఈసీ నియామకాలపై సుప్రీంలో అత్యవసర విచారణ, ఎన్నికల నోటిఫికేషన్‌పై ప్రభావం పడనుందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook